పండగ బరిలో ఉండేదెవరు వెళ్ళేదెవరు

By iDream Post Sep. 09, 2021, 02:00 pm IST
పండగ బరిలో ఉండేదెవరు వెళ్ళేదెవరు

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా విడుదల ఒక నెల ముందు చెప్పారంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడి ఉంటారన్న గ్యారెంటీ ఎంత మాత్రం లేదు. కేవలం పది రోజుల ముందు కన్ఫర్మ్ చేస్తే తప్ప నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఎవరో ఎందుకు లవ్ స్టోరీని రేపు 10కి రిలీజ్ చేస్తామని గత నెల చివర్లో చెప్పి మళ్ళీ మాట మార్చేశారు. దాని స్థానంలో సీటిమార్ వచ్చి పడింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న రావడం లేదని తేలిపోవడంతో ఆ సీజన్ మీద కర్చీఫ్ వేసేందుకు ఎవరికి వారు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ మహాసముద్రం ఆ డేట్ తీసేసుకోగా వారం ముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కొండపొలం రెండూ 8కే రాబోతున్నాయి.

ఇప్పుడు ఫ్రెష్ గా అఖండ కూడా 13 లేదా 14కి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని వినికిడి. బాలన్స్ ఉన్న పాటను ఈ వారం పది రోజుల్లో పూర్తి చేసి నెలాఖరుకు సెన్సార్ పూర్తి చేసేలా బోయపాటి శీను ప్లాన్ చేసుకున్నారట. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ ఊర మాస్ అవతారంలో బాలయ్య చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఇది ఫిక్స్ అయితే బిసి సెంటర్స్ లో మహాసముద్రం లాంటి వాటికి చిక్కులు ఎదురవుతాయి. ఇక్కడితో కథ అయిపోలేదు. తమిళ డబ్బింగులు కూడా ఏవైనా వచ్చే అవకాశాలు లేకపోలేదు.

సంక్రాంతి అంత భారీగా కాకపోయినా విజయదశమి కూడా టాలీవుడ్ కు మంచి సీజనే. ఎలాగూ ఈ ఏడాది వకీల్ సాబ్ తర్వాత స్టార్ హీరోల సినిమాలు పెద్దగా రాలేదు. మాస్ ప్రేక్షకులు కరువులో ఉన్నారు. సరైన సినిమా పడితే వసూళ్ల జాతర ఖాయం. కరోనా థర్డ్ వేవ్ టెన్షన్లు ఒకపక్క ఉన్నప్పటికీ ముందే తేదీని లాక్ చేసుకుంటే తర్వాత నార్మల్ గా ఉంటే ఇబ్బంది ఎదురుకాదన్న ఉద్దేశంతో ఒక్కొక్కరుగా ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ మాటకు కట్టుబడి 13కే వచ్చి ఉంటే పైన చెప్పిన వాటిలో ఏదీ పోటీకి సాహసించేది కాదు. ఇప్పుడు రావడం లేదు కాబట్టి ఇలాంటి రసవత్తరమైన పోరు తప్పడం లేదు

Also Read: తమిళ అమ్మ కథకు అసలు ఛాలెంజ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp