బాలకృష్ణ సినిమాకు ఊహించని పేరు

By iDream Post Sep. 13, 2021, 05:50 pm IST
బాలకృష్ణ సినిమాకు ఊహించని పేరు

ప్రస్తుతం అఖండ బ్యాలన్స్ ఉన్న రెండు పాటలను పూర్తి చేసేందుకు సిద్ధపడుతున్న బాలకృష్ణ తన తర్వాత సినిమా దర్శకుడు గోపిచంద్ మలినేనితో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిపోయిందని క్రాక్ తరహాలో మరోసారి ఒంగోలు ప్రాంతంలో జరిగిన నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించనున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. ఇప్పుడు టైటిల్ కు సంబంధించిన కొత్త లీక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. వినగానే ఇదేదో అవుట్ అండ్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా అనిపించడం ఖాయం. కానీ అఫీషియల్ అయితే కాదు.

అందిన వార్త మేరకు దీనికి 'రౌడీయిజం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. బాలకృష్ణ రౌడీ అనే సౌండ్ వచ్చే టైటిల్ ఇప్పటిదాకా వాడలేదు. కానీ వేరే హీరోలవి వచ్చాయి. చిరంజీవి స్టేట్ రౌడీ, వెంకటేష్ టూ టౌన్ రౌడీ, రాజశేఖర్ రౌడీయిజం నశించాలి, కళ్యాణ చక్రవర్తి రౌడీ బాబాయ్, కృష్ణంరాజు రౌడీ, మోహన్ బాబు రౌడీ, మోహన్ బాబు రౌడీ గారి పెళ్ళాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి . వచ్చే వారం రాబోతున్న సందీప్ కిషన్ గల్లీ రౌడీ, షూటింగ్ పూర్తి చేసుకున్న రౌడీ బాయ్స్ ని ఈ లిస్ట్ లో కలపొచ్చు. సో రౌడీయిజం అనే పేరు బాలయ్యకు పెడితే అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇంకా ప్రకటన చేయలేదు కానీ పెడితే సౌండింగ్ అదిరిపోతుందని వేరే చెప్పాలా. అఖండ విడుదల విషయంలో ఇంకా స్పష్టత రాని నేపథ్యంలో ఇప్పుడీ ప్రాజెక్ట్ ఎప్పుడు రెగ్యులర్ షూట్ కు వెళ్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం క్యాస్టింగ్ తో పాటు హీరోయిన్ వేట కూడా సాగుతోంది. వరసగా ఇప్పటి జెనరేషన్ డైరెక్టర్లతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న బాలయ్య త్వరలో అనిల్ రావిపూడితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో ఆదిత్య 999, పూరి జగన్నాధ్ తో మరో కొత్త చిత్రం లైన్ లో ఉన్నాయి. ఒక్కొక్కటిగా అధికారికంగా ప్రకటించాక వీటికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. రౌడీయిజంకు సంబంధించి కూడా త్వరలోనే క్లారిటీ వస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp