త్రివిక్రమ్ గట్టిగానే బ్యాలన్స్ చేశారే

By iDream Post Sep. 21, 2021, 12:30 pm IST
త్రివిక్రమ్ గట్టిగానే బ్యాలన్స్ చేశారే

దగ్గుబాటి ఫ్యాన్స్ ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ నిన్న సాయంత్రం భీమ్లా నాయక్ సినిమాలో రానా క్యారెక్టర్ ని రివీల్ చేయడం ఇంకా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వైరల్ అయిపోయింది. సెలబ్రిటీ షేర్లు గట్టిగానే దక్కాయి. ఒరిజినల్ వెర్షన్ లో రానా పాత్ర చేసిన పృథ్విరాజ్ రీ ట్వీట్ చేసి పెద్ద మెసేజ్ పెట్టడం నెటిజెన్లను ఆకట్టుకుంది. గతంలో పవన్ కళ్యాణ్ లుక్ ని రివీల్ చేసినప్పుడు టైటిల్ లో మా హీరో పేరు లేదని రానా అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే నిలదీశారు. నిర్మాత నాగవంశీ వేచి చూడండంటే ఏదైనా మార్పు ఉంటుందేమో అనుకున్నారు కానీ ఫైనల్ గా భీమ్లా నాయకే ఫిక్స్ అయిపోయింది.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ కోసం రానాను తక్కువ చేసి చూపిస్తారేమో అనే అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో నిన్న టీజర్ ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. గెటప్, దాని కోసం రాసిన డైలాగులు అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. గబ్బర్ సింగ్ రిఫరెన్సులు, ధర్మేంద్ర అంటూ రానా చెప్పుకోవడం ఇవన్నీ బాగా పేలాయి. మలయాళంలో పృథ్వి చేసిన పాత్రకు ఏ మాత్రం తగ్గని రీతిలో రచయిత త్రివికమ్ తన మార్కు మాయాజాలం గట్టిగానే చూపించినట్టు ఉన్నారు. రానా వార్నింగ్ ఇచ్చే సీన్ లో అవతల ఉన్నది నిత్య మీనన్ అయినప్పటికీ ఆ లుక్ బయటికి రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తానికి డేనియల్ శేఖర్ గురించిన డౌట్లు క్లియర్ అయ్యాయి.

2022 సంక్రాంతికి విడుదల ఫిక్స్ చేసుకున్న భీమ్లా నాయక్ దానికే కట్టుబడి ఉంది. ఆర్ఆర్ఆర్ వస్తుందేమోనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదేమీ లేనట్టుగా కనిపిస్తోంది. అయితే ఆచార్య జనవరి 8కి రావొచ్చనే సంకేతాలు డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే వారం గ్యాప్ లో అన్నదమ్ముల క్లాష్ తప్పకపోవచ్చు.లేదూ చిరు పవన్ లు ఒక అండర్ స్టాండింగ్ కు వస్తే ఒకటి ముందుకో వెనక్కో జరిగే అవకాశం ఉంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ ఈగో డ్రామాకు త్రివిక్రమ్ సంభాషణలు మెయిన్ హై లైట్ గా నిలవబోతున్నాయి. రానాకు జోడిగా చేస్తున్న ఐశ్యర్య రాజేష్ ఏవో కారణాల వల్ల తప్పుకున్నట్టు ఇన్ సైడ్ టాక్

Also Read : స్వర్గానికేగిన ఈశ్వర్ పోస్టర్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp