ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ: ట్రాక్‌ తప్పుతోన్న బిగ్‌బాస్‌

By Satya Cine Sep. 15, 2020, 06:21 pm IST
ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ: ట్రాక్‌ తప్పుతోన్న బిగ్‌బాస్‌
బిగ్‌ హౌస్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్‌ మధ్య ప్రేమ పుడితే ఎలా వుంటుంది.? అన్న కాన్సెప్ట్‌ గతంలోనూ వుంది. కానీ, అవన్నీ డ్రమెటిక్‌ వ్యవహారాలే. హిందీ, తమిళ బిగ్‌బాస్‌ షోలలోనూ గతంలో ఇలాంటి వ్యవహారాల్ని పరిశీలించారు. కొన్ని ప్రేమలు అక్కడ చిగురించి, ఆ తర్వాత పెళ్ళి పీటలెక్కిన సందర్భాలూ వున్నాయి. తెలుగులో మాత్రం ఇంతవరకు అలాంటివేమీ జరగలేదు. అయితే, ఈసారి బిగ్‌బాస్‌ ఓ ‘పెళ్ళి’కి దారి తీసేలానే వుందా? అంటే ఔననే చర్చ సర్వత్రా జరుగుతోంది. ‘ఎవర్ని పెళ్ళాడతావ్‌.?’ అంటూ అబిజీత్‌ని ఉద్దేశించి కింగ్‌ నాగార్జున, ఓపెనింగ్‌ డే ఈవెంట్‌లోనే అడిగేశాడు. కాజల్‌, తమన్నా.. ఇలా కొన్ని ఫొటోలు చూపించాడు నాగ్‌. ఆ తర్వాత ఫొటో సెట్‌లో మోనాల్‌ గజ్జర్‌ కనిపించింది. అప్పటికి బహుశా మోనాల్‌ తన తోటి కంటెస్టెంట్‌ అన్న విషయం తెలియక అబిజీత్‌, ఆమెను పెళ్లాడతానన్నాడు. ఈ విషయాన్ని నాగ్‌ ఫస్ట్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌లోనూ ప్రస్తావించడం గమనార్హం. మరోపక్క మోనాల్‌ - అబిజీత్‌ మధ్య కెమిస్ట్రీ వున్నట్లు చూపించడానికి బిగ్‌బాస్‌ టీవ్‌ు చాలా కష్టపడుతోంది. అయితే, మధ్యలోకి అఖిల్‌ సార్ధక్‌ కూడా వచ్చేశాడు. దీన్ని ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా బిగ్‌ బాస్‌ టీవ్‌ు ప్రొజెక్ట్‌ చేస్తోంది. అయితే, అసలు అక్కడ ఎలాంటి లవ్‌ స్టోరీ బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌కి కనిపించడంలేదు. అదంతా డ్రామా అనే అభిప్రాయం వ్యూయర్స్‌లో బలపడిపోవడంతో, ఇకపై ఈ ట్రాక్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని బిగ్‌బాస్‌ టీవ్‌ు కూడా నిర్ణయించేసుకుందని సమాచారం. ఇలాంటి ‘ట్రాక్‌ తప్పేసిన’ వ్యవహారాలతో బిగ్‌బాస్‌ ఇమేజ్‌ మరింత డ్యామేజ్‌ అయిపోవడం ఖాయమని అంటున్నారు వ్యూయర్స్‌.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp