దేవిశ్రీప్రసాద్ ఇంట వరుస విషాదాలు.. ఒకరి తర్వాత ఒకరు!

By iDream Post Sep. 17, 2021, 02:30 pm IST
దేవిశ్రీప్రసాద్ ఇంట వరుస విషాదాలు.. ఒకరి తర్వాత ఒకరు!

టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ముందుగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ పాలు కాగా అది జరిగిన రెండు రోజులకే నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. ఆ వార్త మరువక ముందే మంది టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అమ్మమ్మ కూడా వయోభారంతో మరణించారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీప్రసాద్ ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సోదరుడు బుల్జ్యోగానిన్ ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆయన చికిత్స పొందుతూ హాస్పిటల్ లో మరణించినట్లు తెలుస్తోంది.

అయితే తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ చనిపోయాడు అనే విషయం తెలుసుకున్న దేవిశ్రీప్రసాద్ మేనత్త సీతామహాలక్ష్మి గుండెపోటు కారణంతో మరణించారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురు పాకలో దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి తండ్రి నారాయణ నివాసం ఉండేవారు. ఆయన కమ్యూనిస్టు కావడంతో తన కుమారుల్లో ఒకరికి బుల్జ్యోగానిన్ అనే పేరు పెట్టారు. ఆయనకు ముగ్గురు కొడుకులు , ముగ్గురు కూతుళ్లు కాగా ముందు కుమార్తె సీతామహాలక్ష్మి, తర్వాత కొడుకులు హరి నారాయణ, సత్యమూర్తి, బుల్జ్యోగానిన్, జ్యోతి, గౌరీ పార్వతి జన్మించారు.

అయితే రష్యన్ కమ్యూనిస్ట్ లీడర్ బుల్జ్యోగానిన్ చనిపోయిన రోజున పుట్టడంతో.. నారాయణ తన చిన్న కొడుకుకు ఆ పేరు పెట్టారు. తాజాగా ఆయన మరణంతోనే కోలుకోలేక దేవిశ్రీ మేనత్త మరణించారు. నిజానికి చనిపోయిన సీతామహాలక్ష్మి ప్రోత్సాహంతోనే సత్యమూర్తి సినీరంగంలో ఎంటర్ అయ్యారని అంటుంటారు, దేవీ ఫ్యామిలీకి సీతామాలక్ష్మితో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇలా ఒకేసారి బాబాయ్, మేనత్త మృతి చెందడంతో దేవిశ్రీప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బుల్జ్యోగానిన్ కొడుకు విజయ్ బుల్జ్యోగానిన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. ఈ మధ్య కాలంలో కాస్త డీలా పడిన దేవిశ్రీప్రసాద్ ఉప్పెన సినిమాతో మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఆ సినిమా తరువాత పుష్ప సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తూ తాను ఏ మాత్రం ఫామ్ కోల్పోలేదు అనే విషయాన్ని ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చేస్తున్నాడు

Also Read : ఎన్టీఆర్ 'హాట్ సీట్' లో ఇద్దరు స్టార్ డైరెక్టర్స్.. ఊపిరులూదుతున్నారుగా!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp