RRR : రాజమౌళి బృందం ముందు కఠిన సవాళ్లు

By iDream Post Dec. 05, 2021, 02:14 pm IST
RRR : రాజమౌళి బృందం ముందు కఠిన సవాళ్లు

క్రమక్రమంగా ఆర్ఆర్ఆర్ జ్వరం ప్రేక్షకుల్లో పెరుగుతోంది. కొద్దిరోజులు మౌనంగా ఉన్న రాజమౌళి బృందం 9న విడుదల చేయబోయే ట్రైలర్ తో అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లే స్కెచ్ ని సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసినవాళ్ల ఫీడ్ బ్యాక్ మాములుగా లేదు. దీని సంగతలా ఉంచితే జనవరి 7 థియేట్రికల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు యమా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే పైకి అంతా సాఫీగానే కనిపిస్తోంది కానీ ఆర్ఆర్ఆర్ దాటాల్సిన సవాళ్లు మాత్రం గట్టిగానే కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ఓమిక్రాన్. దీని తాలూకు ప్రకంపనలు మెల్లగా మొదలవుతున్నాయి. కేసులు పెరిగాయంటే జనంలో భయం మళ్లీ మొదటికే వస్తుంది.

ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలుపెట్టారు. మాల్స్, మల్టీ ప్లెక్సుల్లో వ్యాక్సిన్ వేసుకోని వాళ్లకు నో ఎంట్రీ లాంటి నిబంధనలు అమలులోకి వచ్చాయి. మహారాష్ట్ర, కేరళలో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సీ కొనసాగుతోంది. పబ్లిక్ లో ఆందోళన అనే ఈ అడ్డంకిని దాటడం చాలా అవసరం. మరోపక్క భీమ్లా నాయక్, రాధే శ్యామ్ లు మరోసారి తమ డేట్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టంగా చెప్పేశాయి. సో ట్రయాంగిల్ వార్ తప్పదు. ఆర్ఆర్ఆర్ కు సూపర్ హిట్ టాక్ వచ్చినా తర్వాతి వారం నుంచి స్క్రీన్లను పంచుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ మేరకు వసూళ్ల మీద ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. వాటి స్పందన కూడా చాలా కీలకం.

జక్కన్న టీమ్ మార్కెటింగ్ విషయంలో ఎంత ప్రణాళికగా ఉన్నా ఈ ప్రతిబంధకాలను దాటడం అంత సులభం కాదు. మూడు వందల కోట్లకు పైగా బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా ఏపి తెలంగాణ నుంచే అంత మొత్తాన్ని ఆశిస్తోంది. ఆ టైంలో టికెట్ రేట్లు, అదనపు షోల పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికిప్పుడు చెప్పలేం. టాలీవుడ్ పెద్దలు ఏపి ప్రభుత్వాన్ని కలిసే ఆలోచనలో ఉన్నారు. టైం చూస్తే చాలా తక్కువగా ఉంది. చేతిలో ఉన్న నెల రోజుల్లోనే ప్రమోషన్లు పబ్లిసిటీ సహా ఆర్ఆర్ఆర్ టీమ్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పోటీ సినిమాలతో పాటు ఓమీక్రాన్ భయాన్ని కూడా ట్రిపులార్ జయించాల్సి ఉంటుంది. చూద్దాం

Also Read : Time Concept : టైం కాన్సెప్ట్ ని వాడుకుంటున్న మూడు సినిమాలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp