ప్రేక్షకులను రప్పించాలంటే ఇలా చేస్తే సరి

By iDream Post Oct. 18, 2020, 04:04 pm IST
ప్రేక్షకులను రప్పించాలంటే ఇలా చేస్తే సరి

తెలుగు రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకున్నాయి కానీ కలెక్షన్లు మాత్రం మరీ తీసికట్టుగా ఉన్నాయి. ఢిల్లీ లాంటి నగరాల్లో సైతం కనీస వసూళ్లు లేక ఎగ్జి బిటర్లు చుక్కలు చూస్తున్నారు. మల్టీ ప్లెక్సుల్లో చాలా మటుకు సింగల్ టికెట్ కూడా తెగని కేంద్రాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ చూసిన సినిమాలనే ప్రదర్శనకు ఉంచడంతో పబ్లిక్ ఎంతమాత్రం ఆసక్తి చూపించడం లేదు. విశాఖపట్నంలో ధైర్యం చేసి ఓ మల్టీ ప్లెక్స్ తెరిచి భీష్మ లాంటి సంక్రాంతి మూవీస్ వేస్తే రోజు మొత్తం వచ్చిన కలెక్షన్ కేవలం 1200 రూపాయలేనట. ఇక సింగల్ స్క్రీన్లు తెరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ముంబై, బెంగుళూరు లాంటి సిటీస్ లో సైతం ఒకటి ఆరా మినహా అన్ని చోట్ల ఇదే తరహా స్పందన ఉంది. మరో కారణం టికెట్ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడమే. దీన్ని ముందే గుర్తించిన బెంగాల్ కు చెందిన ఎస్విఎఫ్ అనే చైన్ సంస్థ తమ ఆధ్వర్యంలో నడిచే థియేటర్లలో నాలుగు రోజుల పాటు ఒక్క టికెట్ ధర కేవలం 11 రూపాయలు మాత్రమే ఉంచారు. చిచోరే, మిషన్ మంగళ్, గుమ్నామీ లాంటి పేరున్న చిత్రాలనే వేస్తున్నారు. జనాన్ని అలవాటు చేయాలంటే ఇలా చేయక తప్పదని, ఉచితంగా వేసే బదులు నామమాత్రంగా 11 రూపాయలు వసూలు చేస్తున్నామని సదరు యాజమాన్యం పేర్కొంటోంది.

ఇది చాలా మంచి ఎత్తుగడ. పదకొండు రూపాయంటే ఏ మాత్రం ఆలోచించే మొత్తం కాదు. ఓ రెండున్నర గంటలు శానిటైజ్ చేసిన ఏసి వాతావరణంలో హ్యాపీగా సమయం గడపొచ్చు. ఎలాగూ పాత సినిమాలే కాబట్టి ఈ టికెట్ ఖర్చుని ఎవరు భారంగా అనుకోరు. ఎటొచ్చి వందా, నూటా యాభై అంటేనే అసలు చిక్కు. ఇప్పటికే నెలల తరబడి మూసుకున్న థియేటర్లకు ముందు ఆడియన్స్ హాల్ దాకా వచ్చేలా చేయడం అవసరం. అలాంటప్పుడు బెంగాల్ లో అమలు చేస్తున్న స్ట్రాటజీ ఇక్కడ కూడా ఫాలో కావాలి. మహేష్, బన్నీ లాంటి స్టార్ హీరోల సినిమాలు మరీ పదకొండు కాకపోయినా కనీసం పాతిక రూపాయలు పెడితే అభిమానులైనా వస్తారు. హాలు మొత్తం ఖాళీ సీట్లు పెట్టుకుని షో వేయడం కంటే ఇది మంచి ప్లానే కదా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp