ప్రభాస్ ఈ తరహాలో మొదటిసారి

By iDream Post May. 11, 2021, 03:00 pm IST
ప్రభాస్ ఈ తరహాలో మొదటిసారి
కెరీర్లో ఫస్ట్ టైం ఒకేసారి ఏకంగా మూడు సినిమాలను సెట్ల మీద పెట్టిన డార్లింగ్ ప్రభాస్ మరో మూడు కన్ఫర్మ్ చేయడం దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. రాధే శ్యామ్ ఇంకొంత పార్ట్ బ్యాలన్స్ ఉండగా హైదరాబాద్ లో ఆది పురుష్ కోసం భారీ సెట్లు వేయడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. అయితే వీటికన్నా ఎక్కువగా అభిమానుల చూపు కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్ మీద ఉంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీని మీద అంచనాలు ఇప్పటికే కోటలు దాటేశాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఓ ఇరవై శాతం దాకా ఫినిష్ చేశారు. ఈ ఏడాదిలోగా పూర్తి చేసే టార్గెట్ తో ఉన్నారు.

ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే విషయం ఇప్పుడు గట్టి ప్రచారంలో ఉంది. అది కూడా తండ్రి కొడుకులుగా అంటున్నారు. బాహుబలిలో చేసినప్పటికీ రెండు పాత్రలు ఒకే సీన్ లో కనిపించవు. కానీ ఇందులో కలిసే ఛాన్స్ ఉందని వినికిడి. అంటే వయసు మళ్ళిన క్యారెక్టర్ లో కూడా డార్లింగ్ ని చూడొచ్చన్న మాట. గతంలో దాదాపు అందరు హీరోలు ఇలాంటి రోల్స్ చేసినవాళ్ళే. ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఇలా ఫాదర్ అండ్ సన్ గా చేసినవాళ్ల లిస్ట్ పెద్దదే. ఇప్పుడు ప్రభాస్ కూడా అలా కనిపించడం అంటే అభిమానులకు అంతకన్నా కావలసింది ఏముంటుంది.

ఇది ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. కరోనా దృష్ట్యా ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోవడంతో ఇప్పుడు ప్రభాస్ సినిమాలన్నీ చెప్పిన డేట్ కి వచ్చే ఛాన్స్ తగ్గిపోతోంది. రాధే శ్యామ్ ని జూలై నుంచి అక్టోబర్ కి షిఫ్ట్ చేసే ఆలోచన జరుగుతోంది. అదీ మిస్ అయితే వచ్చే ఏడాది సంక్రాంతి తప్పదు. కానీ ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించిన క్లారిటీ అయితే రాదు. తాను ఒప్పుకున్న ప్రోజెక్టులన్నీ కలిపి సుమారు రెండు వేల కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిని మించిపోయాడన్నది వాస్తవం. సాహో డిజాస్టర్ అయినప్పటికీ దాని ప్రభావం వీటి మీద పడటం లేదంటేనే రేంజ్ ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp