జూనియర్ శ్రీకాంత్ స్మార్ట్ ఎంట్రీ

By iDream Post May. 26, 2021, 05:30 pm IST
జూనియర్ శ్రీకాంత్ స్మార్ట్ ఎంట్రీ
మనకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోల్లో వన్ అఫ్ ది బెస్ట్ అని చెప్పుకోదగ్గ శ్రీకాంత్ తనయుడు రోషన్ త్వరలో పెళ్లి సందడి సీక్వెల్ తో పలకరించబోతున్న సంగతి తెలిసిందే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించకపోయినా ఆయన పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేశారట. ఓ రెండు లిరికల్ వీడియోలు కూడా ఆల్రెడీ యుట్యూబ్లో వదిలేశారు. రోషన్ గతంలోనే టీనేజ్ లవ్ స్టోరీ నిర్మలా కాన్వెంట్ తో పరిచయమయ్యాడు. కానీ అది ఫ్లాప్ కావడంతో దీన్నే లాంచింగ్ మూవీగా ప్రమోట్ చేస్తున్నారు. గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కూడా ఎంఎం కీరవాణే సంగీతం సమకూరుస్తున్నారు.

అసలు విషయానికి వస్తే ఇప్పుడీ పెళ్ళిసందడికి మంచి ఓటిటి ఆఫర్లు వస్తున్నాయట. ప్రైమ్, ఆహాలతో పాటు హాట్ స్టార్ కూడా రేస్ లో ఉందని అంటున్నారు. పెట్టిన బడ్జెట్ మీద గట్టి లాభం అనిపించేలా ధరను కోట్ చేశారని ఇంకా యూనిట్ నుంచి ఎలాంటి స్పందన వెళ్లలేదని తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజుకు కనీసం ఇంకో రెండు నెలల దాకా అనుకూలత కనిపించడం లేదు. ఒకవేళ తెరుచుకున్నా కూడా బోలెడు నిబంధనలు ఉండబోతున్నాయి. ఇవి చాలవన్నట్టు కరోనా సెకండ్ వల్ల జనంలో విపరీతమైన భయం పెరిగిపోయింది. చిన్న సినిమాలకు ధైర్యంగా హాళ్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు.

అందుకే దర్శకేంద్రుడి బృందం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటిదాకా లాక్ డౌన్ మొదలయ్యాక థాంక్ యు బ్రదర్, బట్టల రామస్వామి బయోపిక్కు, సినిమా బండి డైరెక్ట్ గా వచ్చాయి. ఏక్ మినీ కథ ఇవాళ అర్ధరాత్రి నుంచి సందడి చేయబోతోంది. మరికొన్ని లైన్ లో ఉన్నాయి. సో ఒకవేళ పెళ్లిసందడి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే బాగానే ఉంటుంది. పాతికేళ్ల క్రితం స్టార్లు లేకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా పెళ్లి సందడి ప్రేక్షకుల హృదయాల్లో ఇంకా ఫ్రెష్ గానే ఉంది. అదే టైటిల్ తో శ్రీకాంత్ కొడుకుతో సినిమా అంటే అదో కొత్త అనుభూతి. మరి థియేటరా డిజిటలా ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp