మంచి టైంలో ఆహా అనిపించే ఛాన్స్

By iDream Post May. 02, 2021, 04:00 pm IST
మంచి టైంలో ఆహా అనిపించే ఛాన్స్
దేశమంతా కరోనాతో కకావికలం అవుతున్న వేళ థియేటర్ల గురించి ఇంకొంత కాలం మర్చిపోవడమే ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం. అయితే వినోదం లేనిదే ముద్దదిగని సగటు తెలుగు ప్రేక్షకుల ఎంటర్ టైన్మెంట్ కోసం మళ్ళీ ఓటిటిలే దిక్కు కాబోతున్నాయి. ఈ మేరకు కొత్త రిలీజులతో పాటు డైరెక్ట్ డిజిటిల్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. గత రెండు రోజుల్లో వకీల్ సాబ్, సుల్తాన్, ఏ1 ఎక్స్ ప్రెస్ ఇలా మూడు సినిమాలు సందడి చేసి ఇంట్లోనే జనానికి మంచి టైం పాస్ చేయించాయి. ఇప్పుడు అందరి కన్ను మే 7న రాబోతున్న థాంక్ యు బ్రదర్ మీద ఉంది. ఆహా యాప్ లో ఇది స్ట్రీమింగ్ జరగబోతోంది. ఇప్పటికే ట్రైలర్ కూడా వచ్చేసింది.

సెకండ్ వేవ్ ఇన్ డైరెక్ట్ లాక్ డౌన్ మొదలయ్యాక నేరుగా డిజిటల్ లో వస్తున్న సినిమా ఇదే. ఓ నిండు గర్భిణీ, ఓ కోటీశ్వరుడైన యువకుడు ఇద్దరూ లిఫ్ట్ లో ఇరుక్కుపోతే జరిగే ఆసక్తికరమైన సంఘటనల సమాహారంగా దీన్ని తీర్చిదిద్దారు. రమేష్ రాపర్తి డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీని నిజానికి ఓటిటి కోసమే తెరకెక్కించారు. అయితే పెద్ద సినిమాలు వాయిదా పడిన నేపథ్యంలో ఏప్రిల్ చివరి వారంలో థియేటర్లో వేద్దామని ప్లాన్ చేసుకుని ఆ మేరకు ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే సీన్ రివర్స్ అయిపోయి కేసులు పెరిగిపోవడంతో మళ్ళీ మనసు మార్చుకుని తిరిగి ఓటిటికే ఫిక్స్ అయ్యారు. నైజీరియన్ మూవీ ఎలివేటర్ బాయ్ ఆధారంగా తీశారని ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి.

ఇటీవలి కాలంలో దూకుడు పెంచిన ఆహాకు థాంక్ యు బ్రదర్ చాలా కీలకంగా మారబోతోంది. భారీ పెట్టుబడులతో కొత్త సినిమాలు సొంతం చేసుకుంటున్న అల్లు కాంపౌండ్ ఆహాని ఇంకా బలోపేతం చేసేందుకు గట్టి ప్లాన్లు వేస్తోంది. ఆ కారణంగానే వకీల్ సాబ్ తో పోటీ ఉందని తెలిసినా, తమిళ వెర్షన్ ని హాట్ స్టార్ మే 2కి షెడ్యూల్ చేసినా సుల్తాన్ ని మాత్రం ఏప్రిల్ 30కే తీసుకొచ్చింది. ఇప్పుడు థాంక్ యు బ్రదర్ కనక హిట్టు కొడితే వ్యూస్ తో పాటు చందాదారులు కూడా పెరుగుతారు. ఆ తర్వాత లైన్ లో అర్ధశతాబ్దం కూడా ఉంది. మళ్ళీ ఓటిటి హవా మొదలవుతున్న తరుణంలో అనసూయ సినిమా తెచ్చుకునే రెస్పాన్స్ ని బట్టి మిగిలినవి కూడా ప్లాన్ చేయబోతున్నారు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp