వకీల్ సాబ్ వచ్చే అవకాశాలు

By iDream Post Aug. 15, 2020, 01:25 pm IST
వకీల్ సాబ్ వచ్చే అవకాశాలు

లాక్ డౌన్ వల్ల ఫస్ట్ కాపీ చేతిలో ఉండి విడుదల ఆగిపోయిన సినిమాల సంగతి పక్కనబెడితే ఇంకొద్ది భాగం మాత్రమే బాలన్స్ ఉన్నవాటి పరిస్థితి అటుఇటు కాకుండా ఉంది. షూటింగ్ మొదలుపెడదామా అంటే కేసులు అలాగే ఉన్నాయి. రోజూ ఎవరో ఒక సినిమా ప్రముఖులు వ్యాధి బారిన పడుతూనే ఉన్నారు. అందుకే స్టార్ హీరోలు నిస్సంకోచంగా బయటికి వచ్చేందుకు సిద్ధంగా లేరు. మీడియం బడ్జెట్ చిత్రాలు ఇప్పటికే హడావిడి లేకుండా షూట్ చేసుకుంటున్నాయి. స్టార్ల విషయానికి వస్తే ఇప్పుడు అందరి కన్ను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మీదే ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కొన్ని సన్నివేశాలు తప్ప దాదాపు ఎనభై శాతం దాకా పూర్తయ్యిందని ఇప్పటికే టాక్ ఉంది.

ఓ నెల రోజులు కేటాయిస్తే ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. కానీ పవన్ ఆరోగ్య రిత్యా నవంబర్ లేదా డిసెంబర్ దాకా రీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదట. ఒకవేళ అప్పుడు కనక మొదలుపెడితే సంక్రాంతిని మీట్ కావడం కష్టం కావొచ్చు. ఇప్పటికే రంగ్ దే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆ సీజన్ ని లాక్ చేసుకున్నాయి. అప్పటికి థియేటర్లు తెరుచుకుంటాయన్న నమ్మకంతో. కెజిఎఫ్ 2 కూడా గట్టిగానే ట్రై చేస్తోంది. వకీల్ సాబ్ జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకుంటే ఫిబ్రవరి లేదా మార్చ్ ని విడుదలకు ఫిక్స్ చేసుకోవచ్చు. ఎలాగూ స్కూల్, కాలేజీ పిల్లల పరీక్షలు ఆ టైంలో ఉండే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కొంత ఆలస్యం అవ్వొచ్చు. అలాంటప్పుడు ఆ సమయానికి వకీల్ సాబ్ ని కనక విడుదల చేస్తే పవర్ స్టార్ సినిమా కాబట్టి వసూళ్ల గురించి టెన్షన్ పడాల్సిన పని ఉండదు.

ఇది పూర్తి చేస్తే కానీ వేరే పవన్ వేరే ప్రాజెక్ట్స్ లో జాయిన్ కాలేడు. ఇప్పటికే క్రిష్ మూవీ వాయిదా పడింది. హరీష్ శంకర్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడో లేదో తెలియదు. కొత్తగా సురేందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా వీటిలో ఏదో ఒక అధికారిక ప్రకటన వెలువడొచ్చు. దాన్ని బట్టి ప్లానింగ్ ఎలా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్ళకు పైగా గ్యాప్ తో వచ్చే సినిమా అవుతుంది కాబట్టి ఎంత రీమేక్ అయినా వకీల్ సాబ్ కు భారీ ఓపెనింగ్స్ వచ్చే అంచనాలో ట్రేడ్ ఉంది. ఇప్పటికిప్పుడు థియేటర్లు వెంటనే తెరిచినా మొదటి రెండు నెలలు పెద్దగా క్రౌడ్ ఉండదు కాబట్టి పవన్ లంటే రేంజ్ ఉన్న హీరో అయితే బాక్స్ ఆఫీస్ కు జోష్ వస్తుంది. మరి వకీల్ సాబ్ మనసులో ఏముందో ఎప్పుడు బయటికి రావాలనుకుంటున్నాడో దానికి సమాధానం నిర్మాత కంటే ఎక్కువగా పవర్ స్టార్ చేతిలోనే ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp