బిగ్ బాస్ 4కు ఛాన్స్ ఉంది

By iDream Post Jun. 24, 2020, 05:25 pm IST
బిగ్ బాస్ 4కు ఛాన్స్ ఉంది

ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో ఇండస్ట్రీ వర్గాల్లోనూ నిన్న టీవీ సీరియల్ షూటింగ్ లో కరోనా పాజిటివ్ గా తేలిన నటుడి గురించే చర్చ జరుగుతోంది. తక్కువ సభ్యుల మధ్య బడ్జెట్ పరిమితులతో చేసే దానికే ఇంత ప్రమాదం పొంచి ఉంటే ఇక రేపో ఎల్లుండో పెద్ద హీరోలు బరిలో దిగితే ఏంటనే దాని గురించే అందరూ ఖంగారు పడుతున్నారు. దాదాపుగా హైదరాబాద్ లో జరుగుతున్న సీరియల్స్ అన్ని ఆపేశారని టాక్ వస్తోంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ 4 కోసం ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్టుగా తాజా అప్ డేట్. దీనికి కారణం లేకపోలేదు. ఈ షోలో సాధారణంగానే భౌతిక దూరం ఉంటుంది. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ గా అమలు పరిస్తే చాలు.

ఎలాగూ జన జీవనానికి దూరంగా ఇది స్టూడియోలో తీస్తారు. బిగ్ బాస్ కూడా బయటికి కనిపించడు. సో ఈజీగా చేసుకునే అవకాశం చాలా ఉంది. అందుకే స్టార్ మా దానికి తగ్గ ప్రణాళికలు వేయడంలో ఉందని వినికిడి. ఈసారి కీలక పార్టిసిపెంట్ గా ఫ్రెష్ గా టీవీ9 నుంచి బయటికి వచ్చిన బిత్తిరి సత్తిని ఇందులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎలాగూ టీవీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ ఉండే సత్తి కనక షోలో ఉంటే సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే ఆ దిశగా ఇప్పటికే ఓ డిస్కషన్ జరిగిందట. ఎలాగూ కాదనలేని రెమ్యునరేషన్ ఇస్తారు కాబట్టి నో అనే ఛాన్స్ తక్కుగా ఉంటుంది.

కాకపోతే యాంకర్ గా ఎవరు ముందుకు వస్తారు అనేది సస్పెన్స్ గా ఉంది. నాగార్జున పేరు వినిపిస్తోంది కానీ అది కరోనాకు ముందు. ఇప్పుడు సీనియర్ హీరోలు ఎవరూ బయటికి వచ్చే మూడ్ లో లేరు. కానీ మిగిలిన అన్ని షోలు, ప్రోగ్రామ్స్ తో పోలిస్తే బిగ్ బాస్ ఎవరికీ అంతగా రిస్క్ లేనిది. ఒకరినొకరు తాకకుండా టాస్క్ ఇస్తే చాలు. సభ్యులు ఎలాగూ ఐసోలేషన్ లాంటి వాతావరణంలోనే ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా నియమ నిబంధనలు అక్కర్లేదు. కాకపోతే ముందుకొచ్చే యాంకర్ ఎవరో మరి. అసలే బుల్లితెర వినోదం చప్పగా సాగుతున్న తరుణంలో ఇలాంటి కిక్ ఇచ్చే షో అయితే ఖచ్చితంగా కావాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp