అప్పుడు చిరు ఇప్పుడు బాలయ్య

By iDream Post May. 01, 2020, 11:17 am IST
అప్పుడు చిరు ఇప్పుడు బాలయ్య

మనకున్న స్టార్ హీరోల్లో అఘోరా లాంటి వినూత్నమైన పాత్రలు చేసిన వాళ్ళు చాలా చాలా తక్కువ. తమిళ్ లో బాలా తీసిన నేనే దేవుణ్ణిలో ఆర్యను ఆ వేషంలో చూసి మనవాళ్ళూ జడుసుకున్నారు. సినిమాలో విషయం ఉంది కాబట్టి ఓ మాదిరిగా ఆడింది కూడా. ఇదిలా ఉండగా బాలకృష్ణ కొత్త మూవీలో అఘోరా కనిపిస్తారన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాని తాలూకు సమాచారం మాత్రం యూనిట్ సీక్రెట్ గా ఉంచుతూ వచ్చింది. నిజంగా బాలయ్య అఘోరాగా కనిపిస్తాడా లేక ఇదంతా ప్రచారమా అని అనుకున్న వాళ్ళు లేకపోలేదు.

తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన బోయపాటి శీను అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య అఘోరా తరహా పాత్రలో కనిపించేది నిజమేనని అయితే అది కొత్తగా డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుందని చెప్పారు. సో డబుల్ రోల్ అనేది ఖరారయ్యింది. ఇప్పటిదాకా ఈ కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాల్లోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. సింహా-లెజెండ్ తర్వాత ఇందులోనూ ఇదే మేజిక్ రిపీట్ కానుంది. అయితే ఇప్పటిదాకా అఘోరా పాత్ర చేసిన వాళ్ళు ఎవరూ లేరా అనే ప్రశ్న వేసుకుంటే ఒక్క చిరంజీవి మాత్రం కొంచెం ఆ షేడ్స్ ఉన్న రోల్ ని గతంలో చేశారు.

2001లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన శ్రీమంజునాథలో చిరు కొద్దినిమిషాల పాటు అఘోరా వేషంలో ఉన్న ఋషి పాత్రలో కనిపిస్తారు. అది సెకండ్ హాఫ్ లోని కీలక భాగంలో వస్తుంది. కాసేపే అయినా దాని ప్రభావం గట్టిగానే పడింది. ఇన్నాళ్లకు మళ్ళీ తన మిత్రుడు బాలకృష్ణ అఘోరాగా స్పాన్ ఎక్కువగా ఉన్న రోల్ ని ఎంచుకోవడం విశేషం. ఇంకా హీరోయిన్లను ప్రకటించని ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఇందులో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందట. లాక్ డౌన్ అయ్యాక దీని షూటింగ్ ని తిరిగి మొదలుపెట్టబోతున్నారు. ఆలోగా బాలన్స్ ఉన్న క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు బోయపాటి శీను

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp