బోలెడు ధైర్యాన్నిచ్చిన లవ్ స్టోరీ

By iDream Post Sep. 25, 2021, 12:30 pm IST
బోలెడు ధైర్యాన్నిచ్చిన లవ్ స్టోరీ

భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన లవ్ స్టోరీ ఓపెనింగ్స్ తోనే అదరగొట్టేసింది. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కలెక్షన్ల వర్షం కురిసింది. జనం థియేటర్లకు వచ్చేందుకు ఏ మాత్రం ఆలోచించడం లేదని నిన్నటితో క్లారిటీ వచ్చేసింది. చాలా చోట్ల అమ్మాయిలు, కుటుంబాలు ఇంత రద్దీలోనూ రావడం విశేషం. శేఖర్ కమ్ముల మీద వాళ్లకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. టాక్ పూర్తిగా బయటికి రాకుండానే ఈ సినిమాను ఒక్కసారైనా చూసి తీరాల్సిందనేలా జనం వెల్లువలా రావడం విశేషం. దీనికి ఎలాంటి స్పందన వస్తుందోనని ఎదురు చూసిన ఇతర నిర్మాతలకు ఇప్పుడు పక్కా కాన్ఫిడెన్స్ వచ్చేసినట్టే.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏపి తెలంగాణలో కలిపి లవ్ స్టోరీ సుమారుగా 6 కోట్ల 90 లక్షలకు పైగా షేర్ సాధించినట్టు తెలిసింది. గ్రాస్ లెక్కలో చూసుకుంటే ఇది పది కోట్లకు పైమాటే. ఈ స్థాయిలో వసూళ్లు మాస్ ఎంటర్ టైనర్ గా హంగామా చేసిన సీటిమార్ కు సైతం రాలేదు. అదింకా బ్రేక్ ఈవెన్ కూడా చేరకపోవడం గమనార్హం. ఇక ఓవర్సీస్ లో ఈ ఏడాదిలోనే టాప్ గ్రాసర్ గా నిలిచే దిశగా ఈ సినిమా పరుగులు పెడుతోంది. 4 కోట్లకు పైగానే వచ్చిందని అంటున్నారు. వకీల్ సాబ్ ని క్రాస్ చేసినట్టే కనిపిస్తోంది. ఇక ఏరియాల వారీగా కూడా లవ్ స్టోరీ సునామి మాములుగా లేదు.

నైజామ్ - 3 కోట్ల 5 లక్షలు
సీడెడ్ - 1 కోటి 7 లక్షలు
ఉత్తరాంధ్ర - 60 లక్షలు
ఈస్ట్ గోదావరి - 48 లక్షలు
వెస్ట్ గోదావరి - 56 లక్షలు
గుంటూరు - 59 లక్షలు
కృష్ణ - 32 లక్షలు
నెల్లూరు - 25 లక్షలు

ఏపి/తెలంగాణ మొదటి రోజు షేర్ - 6 కోట్ల 91 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా - 32 లక్షలు
ఓవర్సీస్ - 2 కోట్ల 40 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే షేర్ - 9 కోట్ల 63 లక్షలు

ఇది నాగ చైతన్య కెరీర్ లోనే అతి పెద్ద ఓపెనింగ్. గత రికార్డు శైలజారెడ్డి అల్లుడు మీద ఉంది. అది కూడా 7 కోట్ల లోపే. కానీ ఇప్పుడు ఇంత పెద్ద మార్జిన్ తో దాన్ని దాటేయడం గమనార్హం. శేఖర్ కమ్ముల అల్ టైం బెస్ట్ ఫిదాని దాటుతుందా లేదా అనేది వారం ఆగాకే క్లారిటీ వస్తుంది. ఈ రోజు రేపు కూడా వీకెండ్ బుకింగ్స్ హెవీగా ఉన్నాయి. అధిక శాతం హౌస్ ఫుల్స్ నమోదవుతున్నాయి. ఇదే ఊపుని సోమవారం నుంచి సగం కంటిన్యూ చేసినా చాలు. బ్లాక్ బస్టర్ ని అందుకోవచ్చు. ఏపిలో సగం ఆక్యుపెన్సీతోనే ఇంత లెక్కలు రావడం విశేషం. మొత్తానికి పరిశ్రమ ,మొత్తం ఎదురు చూసిన లవ్ స్టోరీ ఓపెనింగ్ అంచనాలను మించేసింది

Also Read : ఆకాశవాణి రిపోర్ట్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp