'ఆదిపురుష్'కు అదే అసలు సమస్య

By iDream Post Oct. 17, 2020, 05:30 pm IST
'ఆదిపురుష్'కు అదే అసలు సమస్య

రామాయణ గాథను ఆధారంగా చేసుకుని ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోయే పాన్ ఇండియా సినిమాకు ఒక్కొక్కటిగా అన్నీ సెట్ అవుతున్నాయి. విలన్ కం రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే ఫిక్స్ కాగా శివుడిగా అజయ్ దేవగన్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు బాలీవుడ్ టాక్. ఇక సీత వేట మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీపికా పదుకునే ఆల్రెడీ ప్రభాస్-నాగ అశ్విన్ మూవీకి కమిటైపోయింది కాబట్టి ఆ ఛాన్స్ లేదు. పోనీ కియారా అద్వానీని తీసుకుందామంటే బల్క్ డేట్స్ ఎక్కువగా ఇవ్వలేనని చెప్పిందట. అనుష్క శర్మని ట్రై చేద్దామా అంటే తను గర్భవతి. ఇంకో ఏడాది దాకా నటించడం అనుమానమే.

నయనతార ఛాయస్ కాదు. జాతీయ మార్కెట్ లో తనకు ఇమేజ్ తక్కువ. అందులోనూ శ్రీరామరాజ్యంలో బాలయ్య సరసన ఇదే పాత్ర చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకొకరి సరసన చూడటం కష్టమే. తాజాగా కృతి సనన్ ని అడుగుతున్నట్టు ముంబై టాక్. మహేష్ బాబు 1 నేనొక్కడినేతో టాలీవుడ్ పరిచయమై నాగ చైతన్య దోచెయ్ లో చేసింది కానీ రెండు ఫ్లాప్ అయ్యేసరికి ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో మాత్రం బాగానే చేసుకుంటూ పోతోంది కానీ టాప్ రేంజ్ కి ఇంకా చేరుకోలేదు. తనను సీతగా తీసుకుంటే ఎలా ఉంటుందన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయట.

ఇది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. పెర్ఫార్మన్స్ ని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆషామాషీగా ఎవరినీ తీసుకోలేరు. గ్లామర్ లుక్స్ పరంగా కృతి ఆకట్టుకునే రూపమే అయినప్పటికీ సీతగా సూట్ అవుతుందా అనేది అనుమానమే. మల్టీ లాంగ్వేజ్ మూవీ కావడంతో నిర్మాణ సంస్థ సౌత్ కథానాయికలకు నో చెబుతున్నారట. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబందించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. సంగీత దర్శకుడు మిగిలిన టెక్నికల్ టీమ్ ని ఫైనల్ చేయాల్సి ఉంది. నాగ అశ్విన్ సినిమా కన్నా ముందే ఆది పురుష్ రిలీజయ్యే ఛాన్స్ లేకపోలేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp