నారా రోహిత్ సమస్యే అది

By iDream Post Jul. 27, 2020, 08:11 pm IST
నారా రోహిత్ సమస్యే అది

పెద్ద కుటుంబం నుంచి వచ్చినా అభిరుచి విషయంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఆపాదించుకుని హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా కొనసాగుతున్న నారా రోహిత్ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అదే శైలిని కొనసాగిస్తున్నాడు. మొదటి రెండు సినిమాలు బాణం, సోలోలతో హిట్స్ అందుకుని ఆ తర్వాత కెరీర్ స్లో చేసుకున్న రోహిత్ మధ్యలో రౌడీ ఫెలో రూపంలో ప్రశంసలే కాదు వసూళ్లు రాబట్టిన మూవీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వ్యక్తిగతంగా రిజర్వ్డ్ గా కనిపించే రోహిత్ కు స్నేహితులు కూడా కాస్త తక్కువే. తనకో సమస్య ఉంది. ఏదైనా జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకపోవడం.

ఓసారి రోహిత్ సినిమా ఫస్ట్ లుక్ కు సంబంధించి చిరంజీవి అశ్వినిదత్ కి మెచ్చుకుంటూ ఓ మెసేజ్ పంపారట. దాని కింద కేసి అని ఉంది. ఇది ఆయన ఫార్వార్డ్ చేశారు. అప్పుడు పెదనాన్న చంద్రబాబునాయుడు ఇంట్లో ఉన్న రోహిత్ అది చూసి ఇదేంటి ఎవరో పంపిన సందేశాన్ని నాకెందుకు సెండ్ చేశారని బయటికి వచ్చాక ఫోన్ చేశారు. కేసి అంటే కొణిదెల చిరంజీవి అని మెగాస్టారే స్వయంగా రెస్పాన్స్ ఇచ్చారని చెప్పారట. అవునా అనుకుని రోహిత్ సైలెంట్ అయ్యాడు. అంటే ఇలాంటి వాటికి ఎలా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాగే తనకు పరిశ్రమలో ఉన్న బాండింగ్ కూడా తక్కువే. మహేష్ బాబు, రవితేజ, పవన్ కళ్యాణ్ వీళ్ళను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాలేదట. అంటే తీసుకోలేదని కూడా చెప్పుకోవచ్చు.

ఫ్యామిలీ పరంగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరి వాడే అయినప్పటికీ హాయ్ బాయ్ చెప్పుకోవడం తప్ప అంతకు మించిన బంధం లేదట. ఇలా ఉండటం నిజంగా అరుదే. తన వ్యక్తిత్వం విషయంలో క్లారిటీగా ఉండే రోహిత్ ఎక్కువ స్నేహం ఉన్నది శ్రీవిష్ణుతోనే. రోహిత్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో ఉన్నారు. అప్పట్లో దక్షిణాదిలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు కానీ ఇకా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళాల్సి ఉంది. విడుదల వాయిదా పడుతూ వచ్చిన పండగలా వచ్చాడు కూడా టైం కోసం ఎదురు చూస్తోంది. శబ్దం, మదరాసి అనే మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నాయి. గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక గట్టి ప్రయత్నం చేస్తున్న రోహిత్ సరైన కథ కుదరాలే కానీ బాలకృష్ణతో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే దానికి తగ్గ కథ దర్శకుడు దొరకాలి అంతే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp