థియేటర్లను భయపెడుతున్నటెనెట్ ఫలితాలు

By iDream Post Sep. 15, 2020, 05:47 pm IST
థియేటర్లను భయపెడుతున్నటెనెట్ ఫలితాలు

సినిమా హాళ్ళు ఎప్పుడు తెరవాలనే చర్చలు ఒకపక్క కొనసాగుతుండగానే మరోవైపు పాండెమిక్ లో థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న టెనెట్ ఇండస్ట్రీకి కొత్త పాఠాలు నేర్పిస్తోంది. కరోనా మహమ్మారికి భయపడకుండా ప్రపంచవ్యాప్తంగా అనుమతి ఇచ్చిన దేశాల్లో మూడు వారాల క్రితం ఇది గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. క్రిస్టోఫర్ నోలన్ సినిమా కావడంతో ఇండియాలోనూ దీని మీద మంచి క్రేజ్ ఉంది. ఒకవేళ ఇక్కడ హాళ్లు ఓపెన్ చేస్తే ముందు విడుదలయ్యే మూవీ కూడా ఇదే. అయితే ఇక్కడ కొన్ని సీరియస్ అంశాలు గమనించాలి. టెనెట్ కు అత్యధిక రెవిన్యూ వస్తుందని ఆశించిన నిర్మాణ సంస్థకు అంత మొత్తం వచ్చే అవకాశం కనిపించడం లేదు .

వార్నర్ బ్రదర్స్ అంచనాలకు చాలా తక్కువగా అమెరికాలో ఆగస్ట్ 31 నాటికి కేవలం 30 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది. హౌస్ ఫుల్ అయ్యే అవకాశం లేకపోవడం, సీటింగ్ ఆంక్షలు, ప్రజల్లో ఉన్న వైరస్ భయం తదితరాలు బాగా ప్రభావం చూపించాయి. మొత్తం వరల్డ్ వైడ్ చూసుకుంటే టెనెట్ కు వచ్చిన లెక్క 207 మిలియన్ డాలర్లు. ఇందులో సింహభాగం యుఎస్ ది ఉండాల్సింది. కానీ అనూహ్యంగా సీన్ రివర్స్ అయ్యింది. దీని దెబ్బకు వచ్చే నెల ప్లాన్ చేసుకున్న వండర్ విమెన్ 1984ని ఏకంగా డిసెంబర్ కి షిఫ్ట్ చేశారు. ఇలా వాయిదా పడటం ఇది మూడోసారి. క్యాండీమెన్ ను ఏకంగా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు. నవంబర్ లో రావాల్సిన బ్లాక్ విడో, నో టైం టు డైలు ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాయన్న గ్యారెంటీ లేదు. అప్పటికి భారతదేశంతో సహా అన్ని చోట్లా పరిస్థితులు నార్మల్ గా ఉంటేనే వదులుతారు. లేదా మళ్ళీ డేట్ మారక తప్పదు. ఓటిటిలో పే పర్ వ్యూ మోడల్ లో వచ్చిన ములన్ డిజాస్టర్ కావడం కూడా ప్రొడ్యూసర్లను ఆలోచనలో పడవేస్తోంది.

టెనెట్ ఒక్క అమెరికాలోనే 3000 థియేటర్లలో విడుదలైంది. న్యూ యార్క్ లాంటి నగరాల్లో పూర్తి స్థాయిలో స్క్రీన్లు తెరవనప్పటికీ ఫిగర్స్ భారీగా నమోదవుతాయని అనుకున్నారు. కానీ అంచనాలకు భిన్నంగా టెనెట్ రివర్స్ లో వెళ్తోంది. వీక్ డేస్ లో డ్రాప్ 40 శాతం పైగా ఉండటం తీవ్రతకు అద్దం పడుతోంది. పైగా థియేటర్లు తెరిచిన చాలా దేశాల్లో కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి. అందుకే జనం భయపడుతున్నారు. ఎంత వినోదమైనా సినిమా ఎవరికీ మొదటి ప్రాధాన్యత కాదు. ఈ ఒక్క కారణం చాలా దారుణంగా దెబ్బ తీస్తోంది. ఆరు స్క్రీన్లు ఉన్న ఓ యుఎస్ మల్టీ ప్లెక్సులో మూడు తెరిస్తే గత పది రోజుల నుంచి వస్తున్న జనాన్ని చూసి తీవ్ర నిరాశ కలుగుతోందని అక్కడ ఆపరేటర్ గా ఉన్న వ్యక్తి కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మన దేశంలోనూ త్వరలో థియేటర్లు తెరిస్తే టెనెట్ లాగా ముందుకు వచ్చి సాహసం చేసే నిర్మాత ఎవరు. మొత్తానికి థియేటర్లను టెనెట్ ఫలితం నిలువునా వణికిస్తోందన్నది వాస్తవం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp