RRR : 52 రోజుల టైంతో రాజమౌళి టీమ్ పరుగులు

By iDream Post Nov. 14, 2021, 06:30 pm IST
RRR : 52 రోజుల టైంతో రాజమౌళి టీమ్ పరుగులు

ఇంకో 52 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. టాలీవుడ్ కాస్ట్లీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పటికైతే జనవరి 7 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. టికెట్ రేట్ల విషయమై నిర్మాత దానయ్య కోర్టు వెళ్తారేమోననే ప్రచారాలను కొట్టి పాటిస్తూ టీమ్ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డితో స్వయంగా చర్చించి సమస్యను పరిష్కరించుకుంటాం కానీ న్యాయస్థానం దాకా వెళ్ళమని తేల్చి చెప్పింది. సో ఏదున్నా బయటే మాట్లాడుకోబోతున్నారు. మొదటి రోజు లేదా వారం రోజులు టికెట్ ధర 500 రూపాయల దాకా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండిస్తూ రాజమౌళి బృందం ఎలాంటి ట్వీట్ వేయలేదు

ఇదిలా ఉండగా చేతిలో ఉన్న తక్కువ టైంని జక్కన్న టీమ్ ఫుల్ గా వాడుకుకేందుకు ప్లాన్లు సిద్ధం చేస్తోంది. ఇప్పటిదాకా రెండు ఆడియో సింగల్స్ వచ్చాయి. వీటిలో నాటు నాటు ఓ రేంజ్ లో చార్ట్ బస్టర్ అయ్యింది. సోషల్ మీడియాలో దీని మీద లెక్కలేనన్ని వీడియోలు పోస్టులు రీల్స్ వచ్చి పడ్డాయి. అందుకే థర్డ్ సాంగ్ కూడా అదే స్థాయిలో ఉండేలా ప్రణాళిక వేశారట. అందులో భాగంగా ఈ సినిమాతో టై అప్ చేసుకున్న పివిఆర్ మల్టీ ప్లెక్సుల్లో ఈ పాటను నేరుగా స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. యుట్యూబ్ లో రావడానికి ముందే స్పెషల్ ప్రీమియర్ గా ఆడియెన్స్ ఆ థియేటర్లలో చూడొచ్చన్న మాట

ఇంకా థియేట్రికల్ ట్రైలర్ బాకీ ఉంది. దాని కోసం గ్రాండ్ ఈవెంట్ ఉండనుంది. అది దుబాయ్ లో జరిగే అవకాశం ఉంది. తన కోసం రెండు నెలలు కేటాయించమని రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను అడిగాడట. ఈ కారణంగానే కొరటాల శివ, శంకర్ ల రెగ్యులర్ షూట్లకు కొంత బ్రేక్ పడొచ్చని ఇన్ సైడ్ టాక్. విస్తృతంగా మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు. నేషనల్ మీడియా కూడా ఉంటుంది కాబట్టి అందరికీ కేటాయించడం పెద్ద సవాల్ లాంటిది. మరోవైపు రాధే శ్యామ్ రేపటి నుంచి తన పబ్లిసిటీ స్టార్ట్ చేస్తోంది. దానికన్నా అప్పర్ హ్యాండ్ లో ఉండాలంటే ఆర్ఆర్ఆర్ యూనిట్ మాములు పరుగులు పెడితే సరిపోదు

Also Read : 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp