మనసు మార్చుకుంటున్న బెల్ బాటమ్

By iDream Post Jan. 21, 2021, 05:53 pm IST
మనసు మార్చుకుంటున్న బెల్ బాటమ్

లాక్ డౌన్ ముగియక ముందే ఎంతో సాహసోపేతంగా విదేశాలకు వెళ్లి మరీ షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ సినిమా విడుదల కోసం అభిమానులే కాదు డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ముందు అనుకున్న ప్రకారమైతే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇప్పుడా నిర్ణయంలో మార్పు జరిగినట్టు సమాచారం. అమెజాన్ ప్రైమ్ తో డీల్ మాట్లాడుకుని నేరుగా డిజిటల్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు ముంబై టాక్. ఇది అధికారికంగా వచ్చిన వార్త కాదు కానీ నిప్పు లేనిదే పొగరాదన్న తరహాలో ఇప్పటికే అక్కడి మీడియాలో ఇది వైరల్ అయ్యింది.

ఒకవేళ నిజమైతే మాత్రం ఈ పరిణామం ఖచ్చితంగా షాక్ ఇచ్చేదే అని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఏడాది లక్ష్మి బాంబ్ తో స్టార్ హీరోల్లో మొదటగా ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది అక్కినే. అప్పుడు పంపిణీదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అందరూ దాన్ని లైట్ తీసుకున్నారు. కానీ బెల్ బాటమ్ అలా కాదు. చాలా అంచనాలు ఉన్నాయి. ఇదే టైటిల్ తో వచ్చిన సూపర్ హిట్ కన్నడ మూవీని స్ఫూర్తిగా తీసుకున్నారనే టాక్ వచ్చింది కానీ వాస్తవంగా ఇది వేరే లైన్ తో రూపొందించినట్టు వినికిడి. ప్రస్తుతానికి అక్షయ్ కుమార్ ఈ విషయంగా మౌనంగానే ఉన్నాడు. దీనికి దర్శకుడు రంజిత్ ఎం తివారి. ఈయనా ఏ మాటా చెప్పడం లేదు.

థియేటర్లు తెరుచుకున్నా కూడా బెల్ బాటమ్ యూనిట్ ఇలా ఆలోచించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే బాలీవుడ్ పెండింగ్ లో ఉన్న రిలీజులు ఇప్పటికే చాలా ఉండటంతో అన్నీ అయ్యాక చేసే లోపు దసరా లేదా దీపావళి దాటిపోతుందట. అంతే కాదు అక్షయే నటించిన మరో క్రేజీ మల్టీ స్టారర్ సూర్యవంశీ డేటే ఇప్పటిదాకా ఖరారు చేయలేదు. అటుఇటుగా మార్చ్ అనుకుంటున్నారు. అదే జరిగితే బెల్ బాటమ్ ఏప్రిల్ లో సాధ్యం కాదు. లేట్ గా రావాల్సి ఉంటుంది. అందుకే ఈ గోలంతా ఎందుకని ప్రైమ్ ఇచ్చిన భారీ ఆఫర్ వైపే మొగ్గు చూపొచ్చని తెలిసింది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. ఓటిటిలో కోణంలోనే పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp