డైలమాలో తమన్నా శీతాకాలం ?

By iDream Post Oct. 30, 2020, 01:32 pm IST
డైలమాలో తమన్నా శీతాకాలం ?

స్టార్ హీరోయిన్ గా ఓ దశాబ్దం దాకా తెరను ఏలిన తమన్నా ఇటీవలి కాలంలో సీనియర్ మోస్ట్ హీరోలతో పాటు అప్ కమింగ్ ఆరిస్టులతోనూ నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య సత్యదేవ్ తో కన్నడ హిట్ మూవీ 'లవ్ మాక్ టైల్' రీమేక్ 'గుర్తుందా శీతాకాలం'లో చేసేందుకు ఓకే చెప్పింది. ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో జరిగాయి. నాగ శేఖర్ దర్శకత్వంలో తక్కువ షెడ్యూల్స్ లో వేగంగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఏమైందో కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ సైలెంట్ అయ్యింది. దాని బదులుగా ఆలస్యంగా మొదలైన తిమ్మరుసులో సత్యదేవ్ యాక్టివ్ గా ఉండటంతో కొత్త ఊహాగానాలు చెలరేగాయి.

గుర్తుందా శీతాకాలం డ్రాప్ అయ్యారని అందుకే తమన్నా కూడా వేరే సినిమాలవైపు చూస్తోందని ఫిలిం నగర్ లో ప్రచారం ఊపందుకుంది. అయితే నిర్మాతలు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. వేరే కారణాల వల్ల కొంత లేట్ అవుతున్నప్పటికీ ఆగలేదని, త్వరలోనే రీ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నట్టుగా తెలిసింది. తమన్నాకు ఇటీవలే కోవిడ్ వచ్చి రికవరీ కావడం వల్ల కాల్ షీట్స్ లో సమస్య వచ్చిందే తప్ప సత్యదేవ్ తిమ్మరుసులో జాయిన్ కావడానికి దీనికి సంబంధం లేదంటున్నారు. ఏదేమైనా గుర్తుందా శీతాకాలం యూనిట్ ఏదైనా అఫీషియల్ క్లారిటీ ఇస్తే బెటర్

లాక్ డౌన్ తర్వాత చిన్న సినిమాల షూటింగులే వేగంగా జరుగుతున్నాయి. స్టార్లు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. థియేటర్లు తెరుచుకోవడం మీద ఇంకా సందిగ్దత కొనసాగుతున్నప్పటికీ జనవరికంతా సద్దుమణుగుతుందని ఇండస్ట్రీ పెద్దలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సత్య దేవ్ లాంటి బడ్జెట్ హీరోలకు ఇప్పుడు డిమాండ్ బాగా ఉంది. ఎక్కువ రిస్క్ లేకుండా తక్కువ ఖర్చుతో సినిమాలు చేసే అవకాశం ఉండటం, ఒకవేళ బిజినెస్ ఆశించినంత జరగకపోయినా ఓటిటి రూపంలో పెట్టుబడికి గ్యారెంటీ ఉండటం లాంటి కారణాలు దీనికి దోహదం చేస్తోంది. మరి గుర్తుందా శీతాకాలం కూడా అదే వరసలో పూర్తయితే బాగుంటుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp