తమన్నా కెరీర్ ప్లానింగ్ బాగుందిగా

By iDream Post Sep. 26, 2021, 06:30 pm IST
తమన్నా కెరీర్ ప్లానింగ్ బాగుందిగా

సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం దర్శక నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారుతోంది. ముఖ్యంగా నిన్నటి తరం నలుగురు స్టార్లకు జోడిని వెతకడం అదో తతంగం అయిపోయింది. ఇప్పటి జెనరేషన్ వాళ్ళను అడిగితే భవిష్యత్తు ఆవకాశాల టెన్షన్ తో నో చెప్పేస్తున్నారు. పోనీ పాతవాళ్లను తీసుకుందామా అంటే పాటల విషయంలో మాస్ ఆడియన్స్ తో రిస్క్. అందుకే రెమ్యునరేషన్లు ఎక్కువైనా పర్లేదు పదేళ్ల సీనియర్ బ్యూటీలతో చేసేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150కి కాజల్ అగర్వాల్ ని తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఆచార్యలోనూ ఎవరెవరినో ట్రై చేసి ఫైనల్ గా మళ్లీ తనకే ఓటేశారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ కి ఇంకా సెట్ చేయలేదు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం వేదాళం రీమేక్ భోళా శంకర్ లో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నానే ఓకే చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఈ ఇద్దరూ సైరా నరసింహారెడ్డిలో చేశారు. జోడి గురించి కామెంట్స్ వచ్చాయి కానీ మెయిన్ హీరోయిన్ నయనతార కావడంతో అవి అంతగా హై లైట్ కాలేదు. ఈ కారణంగానే చిరు తమన్నాల మీద షూట్ చేసిన ఓ డ్యూయెట్ ని ఎడిటింగ్ లో తీసేశారని అప్పట్లో టాక్ వచ్చింది. మరి ఇప్పుడు కమర్షియల్ సినిమా కాబట్టి అలాంటి ఇబ్బంది రాదనుకున్నారో ఏమో. ఒరిజినల్ వెర్షన్ లో పాత్ర శృతి హాసన్ చేసింది. పెద్ద స్కోప్ ఉండదు కానీ హీరోతో కాసేపు అల్లరి చేసి పాటలు పాడేందుకు తప్ప మరీ ఎక్కువ ప్రాధాన్యం ఉండదు.

తమన్నా ఇప్పటి హీరోలతో అవకాశాలు తగ్గిపోయాక కెరీర్ ని చాలా తెలివిగా ప్లాన్ చేసుకొంటోంది. ఒక పక్క వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పేస్తోంది. మరోవైపు మాస్ట్రో లాంటి సినిమాల్లో నెగటివ్ రోల్స్ తో సైతం మెప్పించేస్తోంది. ఇంకో వైపు జెమిని మాస్టర్ చెఫ్ లాంటి వంటల ప్రోగ్రాంకు యంకర్ గా స్టార్ట్ చేసింది. ఇవి కాకుండా ఎఫ్3 లాంటి సినిమాల్లో ఆఫర్లు ఎలాగూ వస్తూనే ఉన్నాయి. సత్యదేవ్ తో చేసిన గుర్తుందా శీతాకాలం తాలూకు అప్ డేట్స్ రావడం లేదు. హిందీలో బోలె చూడియాన్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఎప్పుడో రెండేళ్ల క్రితం పూర్తయిన దటీజ్ మహాలక్ష్మి జాడ మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఓటిటి థియేటర్ దేంట్లోనూ వచ్చే అవకాశం దగ్గరలో కనిపించడం లేదు

Also Read : మెగాస్టార్ సూపర్ స్టార్ ఇద్దరికీ ఒకే సోదరి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp