తమన్నా 3 రిస్కీ పాత్రలు

By iDream Post Sep. 20, 2020, 12:42 pm IST
తమన్నా 3 రిస్కీ పాత్రలు

మిల్కీ బ్యూటీగా టాలీవుడ్ లోని ఇప్పటి ప్లస్ నిన్నటి జెనరేష్న్ హీరోల్లో అధిక శాతం జోడిగా నటించేసిన తమన్నా తన కెరీర్ లేట్ ఇన్నింగ్స్ లో చాలా వైవిధ్యంగా దూసుకుపోతోంది. ఫామ్ లో ఉన్నప్పటిలా ఇప్పుడు అవకాశాలు రావడం కష్టం కాబట్టి వచ్చిన ఆఫర్లలోనే తన నటనను పదును పెట్టేవి లెక్కకట్టి మరీ ఎంచుకుంటోంది. నిన్న నితిన్ అందాదున్ రీమేక్ లో టబు పాత్రకు తనను ప్రకటించడం ఫ్యాన్స్ కి సైతం షాక్ కలిగించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న అలాంటి రోల్ ని ఒప్పుకోవడం ఏమిటా అనే టాక్ గట్టిగానే సాగింది. అందులోనూ అది మధ్య వయసు మహిళ క్యారెక్టర్. కోటిన్నర రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి చేస్తోందనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తున్నా ఛాలెంజ్ కు సిద్ధపడే ఓకే చేసింది మాత్రం స్పష్టం.

ఇక అప్ కమింగ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సత్యదేవ్ తో కన్నడ రీమేక్ 'గుర్తుందా శీతాకాలం' కూడా ఒకరకంగా డిఫరెంట్ కాన్సెప్ట్. లవ్ స్టోరీనే అయినప్పటికీ చాలా డెప్త్ గా ఎమోషనల్ గా త్యాగపూరితంగా సాగుతుంది. ఊహించని షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ గ్లామర్ పాత్ర కాదు కాబట్టి ఇదీ ఒకరకంగా రిస్కే. హీరో ఎవరు ఇమేజ్ ఏంటి అనే క్యాలికులేషన్లు ఇకపై చేయనని తమన్నా దీని ద్వారా చెప్పకనే చెప్పింది. ఇక మూడోది మరో శాండల్ వుడ్ రీమేక్ 'ఆ కరాళ రాత్రి' అని నిన్నటి నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ కాన్సెప్ట్ మూవీని తెలుగులో ఆహా కోసం ప్రవీణ్ సత్తారు తీయబోతున్నట్టు వినికిడి. థియేటర్ కోసం కాకుండా స్ట్రెయిట్ గా ఓటిటి రిలీజ్ కోసమే దీన్ని తీస్తారట.

ఇదే సినిమాకు పాయల్ రాజ్ పుత్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని న్యూస్ వచ్చింది కానీ ఫైనల్ గా తమన్నాను వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఓ మారుమూల పల్లెటూరిలో మూడు లొకేషన్లలో సాగే ఈ చిత్ర కథ చాలా షాకింగ్ గా ఉంటుంది. ఇందులోనూ ఫిమేల్ లీడ్ నెగటివ్ గానే సాగుతుంది. ఒకవేళ తమన్నా చేస్తే మాత్రం తనకు గుర్తుండిపోయేలా నిలిచిపోవడం ఖాయం. ఇది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా చెప్పలేం. మొత్తానికి లేట్ గా అయినా తమన్నా రెగ్యులర్ పాత్రలు కాకుండా ఇలాంటి డిఫరెంట్ జానర్స్ ఎంచుకోవడం మంచి విషయమే. ఎలాగూ ఎఫ్3 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఒకవేళ వెంకటేష్ అందులో ఉంటే కనక జోడిగా తమన్నానే కొనసాగించాల్సి ఉంటుంది. మొత్తానికి కొత్త తరం హీరోయిన్ల కన్నా ఎక్కువ బిజీగా తమన్నానే కనిపించడం విశేషమే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp