నితిన్ కోసం క్రేజీ హీరోయిన్స్ కాంబో

By iDream Post Sep. 19, 2020, 01:05 pm IST
నితిన్ కోసం క్రేజీ హీరోయిన్స్ కాంబో

భీష్మతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాక మంచి ఊపుమీదున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే బాలన్స్ ని ఫినిష్ చేయడం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇది థియేటర్లో వస్తుందా లేక ఓటిటికి జై కొడుతుందా అనే దాని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీని సంగతలా ఉంచితే నెక్స్ట్ చేయబోయే అందాదున్ తెలుగు రీమేక్ కు సంబంధించిన కీలకమైన అప్ డేట్ అఫీషియల్ గా వచ్చేసింది. నితిన్ సరసన మెయిన్ హీరోయిన్ గా నభ నటేష్ చేయనుండగా హిందీ వెర్షన్ లో కీలకంగా నిలిచిన టబు రోల్ ని తమన్నాకు ఆఫర్ చేయడం పెద్ద విశేషం.

ఎందుకంటే ఈ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. కథలో అధిక భాగం తన చుట్టే తిరుగుతుంది. హీరోకు కంటికి సంబంధించిన వైకల్యానికి తనే కారణం అవుతుంది. ఇదే కాకుండా ఊహించని ట్విస్టులు మలుపులు ఉంటాయి. అందుకే తమన్నా చేయడం ఒక రకంగా షాక్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు లేకపోలేదు. ఎప్పుడో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలుపెడతారు. నితిన్ ఫ్యామిలీ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ మీద సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తారు.

భీష్మకు సూపర్ హిట్ స్కోర్ ఇచ్చింది తనే. హరి కె వేదాంత్ ఛాయాగ్రహణం ఫిక్స్ అయ్యింది. నాని డ్యూయల్ రోల్ లో కృష్ణార్జున యుద్ధంతో డిజాస్టర్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ మళ్ళీ తన ఫామ్ ను అందుకోవడానికి ఈ స్క్రిప్ట్ మీద గట్టిగానే వర్క్ చేశారట. మంచి ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నితిన్ పాత్ర అధిక శాతం కళ్ళు లేనట్టుగా సాగుతుంది. అక్కడ ఆయుష్మాన్ ఖురానాకు ఇది తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. అందుకే నితిన్ ఏరికోరి మరీ ఈ ఛాలెంజింగ్ రోల్ ని ఎంచుకున్నాడు. వచ్చే సమ్మర్ లో విడుదలకు ప్లాన్ చేసుకున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ డిసైడ్ కావాల్సి ఉంది. ఓ హిందీ సినిమా రీమేక్ లో నితిన్ నటించడం ఇదే మొదటిసారి. అభిమానుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp