మూడేళ్ళ తర్వాత తాప్సీ రీ ఎంట్రీ

By iDream Post Jun. 15, 2021, 12:00 pm IST
మూడేళ్ళ తర్వాత తాప్సీ రీ ఎంట్రీ
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తీసిన ఝుమ్మంది నాదంతో టాలీవుడ్ కు పరిచయమైన తాప్సీ తక్కువ టైంలోనే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో కలిసి నటించినా ఇక్కడ టైం కలిసి రాక ఎంచక్కా బాలీవుడ్ లో సెటిలైపోయింది. దానికి తోడు బద్లా లాంటి సినిమాల్లో అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలకు ధీటుగా నటించడం చాలా పేరు తీసుకొచ్చింది. ఆపై హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి తనో మంచి ఛాయస్ గా నిలిచింది. లేటెస్ట్ గా తను నటించిన హసీన్ దిల్ రుబా, రష్మీ రాకెట్ రెండూ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని సెట్స్ పై నిర్మాణంలో ఉన్నాయి. అయితే తాప్సీ కొంత కాలంగా తెలుగుకు దూరంగా ఉంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టనుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడు ఆర్ఎస్ జె స్వరూప్ దర్శకత్వం వహిస్తున్న మిషన్ ఇంపాజిబుల్ లో తనకో కీలకమైన పాత్రను ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఇందులో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ లేరు కాబట్టి క్యారెక్టర్ లో ఏదో వెయిట్ ఉండే ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథను అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఆ మధ్య చిన్న పిల్లలతో వదిలిన  ఫస్ట్ లుక్ పోస్టర్ కొంత వివాదం రేపితే దాన్ని విత్ డ్రా చేసుకున్నారు కానీ అప్పటికే అది వైరల్ అయ్యింది.

మొత్తానికి తాప్సీని మరోసారి అభిమానులు తెరమీద చూడబోతున్నారు. 2018లో ఆది పినిశెట్టి  సరసన  చేసిన నీవెవరో ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దానికన్నా ముందు ఆనందో బ్రహ్మ మాత్రం  మంచి విజయాన్ని అందుకుంది. లాక్ డౌన్ వల్ల ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోవడంతో మిషన్ ఇంపాజిబుల్ ని వీలైనంత వేగంగా పూర్తి చేసి దసరా లేదా దీపావళికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో తన మొదటి సినిమాలో దర్శకేంద్రుడి టేకింగ్ మీద కామెంట్స్ చేసి ఆ తర్వాత సారీ చెప్పిన తాప్సీ చాలా సెలెక్టివ్ గా ఇక్కడ ప్రాజెక్టులు చేస్తోంది కానీ నిజానికి తనను రెగ్యులర్ హీరోయిన్ గా తీసుకునే ఉద్దేశమైతే ఎవరికీ లేదు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp