తెలుగులో రానున్న సూపర్ మూవీ

By iDream Post Feb. 23, 2021, 10:42 am IST
తెలుగులో రానున్న సూపర్ మూవీ

మాములుగా ఏదైనా పక్కభాషలో సినిమా సూపర్ హిట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా డబ్బింగ్ కోసం లేదా రీమేక్ హక్కుల కోసం మనవాళ్ళు పోటీ పడటం సహజం. ఇది అన్ని పరిశ్రమల్లో ఉన్నదే. అయితే రెండేళ్లు క్రితం వచ్చిన చిత్రాన్ని కొనుగోలు చేయడం అంటే విచిత్రమేగా. 2019 తమిళంలో సూపర్ డీలక్స్ వచ్చింది. విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా నటించిన ఈ మూవీ విమర్శకులతో సైతం శభాష్ అనిపించుకుంది. సమంతా- రమ్యకృష్ణ- ఫర్హాద్ ఫాజిల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించగా హైదరాబాద్ లో తమిళ వెర్షన్ రిలీజైనప్పుడు ఇక్కడ జనం బాగానే చూశారు. కానీ తెలుగులో తెచ్చే ప్రయత్నం మాత్రం జరగలేదు.

తాజాగా ఓ నిర్మాణ సంస్థ దీని డబ్బింగ్ కం రీమేక్ హక్కులు కొన్నట్టు సమాచారం. ఒకవేళ రీమేక్ అనుకుంటే మాత్రం ఇందులో రిస్క్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం టిపికల్ గా అనిపించే ఈ స్టోరీ లైన్ అక్కడి ఆడియన్స్ టేస్ట్ కి మ్యాచ్ అయ్యింది కానీ మనవాళ్ళు అంగీకరించడం కొంచెం కష్టమే. అందులోనూ హిజ్రాను ప్రధాన పాత్రగా చూపించే కమర్షియల్ సినిమా టాలీవుడ్ లో పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. అందులోనూ ఆ క్యారెక్టర్ విజయ్ సేతుపతి తప్ప ఇంకెవరు చేయలేరు అన్నంత గొప్పగా పండింది. అతను చేయలేను అంటే ఇంకో నటుడిని రీప్లేస్ చేయడం పెద్ద సవాల్. అదంత సులభం కాదు.

వాస్తవానికి సూపర్ డీలక్స్ లాంటి సినిమాలు అన్ని భాషల్లోనూ రావాలి. కాకపోతే కమర్షియల్ కోణంలో చూసుకుంటే మాత్రం వీటి వల్ల కలిగే ప్రయోజాలను తక్కువ. కేవలం అభిరుచి ఉన్న నిర్మాతలు మాత్రమే సాహసం చేయగలరు. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో సోషల్ మీడియాలో ఎన్ని ప్రశంసలు దక్కినా కూడా తెలుగులో కనీసం డబ్ చేసే సాహసం కూడా ఎవరూ చేయలేదు. ఇప్పుడు ఏకంగా రీమేక్ అంటే ప్రకటించే దాకా నమ్మలేం. ఒకవేళ డబ్బింగ్ చేస్తే మాస్టర్, ఉప్పెనతో వచ్చిన క్రేజ్ ఆధారంగా విజయ్ సేతుపతి ప్లస్ సమంతా ఇమేజ్ లు దీని ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp