సినిమా ప్రియులకు వేసవి యుద్ధం

By iDream Post Jan. 22, 2021, 02:27 pm IST
సినిమా ప్రియులకు వేసవి యుద్ధం

సంక్రాంతి సందడి ఇంకొద్ది రోజుల్లో ముగుస్తోంది. సోమవారం ఒక్కటి మినహాయిస్తే రిపబ్లిక్ డేతో కలిపి మొత్తం వీకెండ్ లో నాలుగు రోజులు సెలవులు వస్తాయి కాబట్టి పండగ సినిమాల జోరు ఇంకా కొనసాగుతోంది. వీటితో పాటు రేపటి నుంచి బంగారు బుల్లోడు జత కట్టనుంది. తర్వాత ఫిబ్రవరిలో అన్నీ మీడియం రేంజ్ మూవీసే ఉండటంతో మళ్ళీ సమ్మర్ దాకా పెద్ద యుద్ధాలు కనిపించే అవకాశాలు లేవు. థియేటర్లకు జనం వస్తారన్న గ్యారెంటీ దక్కడంతో వంద శాతం సీట్లకు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అనుమతి ఇస్తుందాని పరిశ్రమ వర్గాలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. వ్యాక్సిన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం అంటున్నారు.

ఇక అసలైన పోటీ సమ్మర్ సందర్భంగా ఉండబోతోంది. ముందు అందరి కళ్ళూ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మీదే ఉంటున్నాయి. మర్చి చివరి వారం లేదా ఏప్రిల్ 9న రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో ఉంది. ఆపై చిరంజీవి 'ఆచార్య' ఒక నెల గ్యాప్ తో మే 9న జగదేకవీరుడు అతిలోకసుందరి సెంటిమెంట్ తో వస్తే ఎలా ఉంటుందన్న చర్చలు జరుగుతున్నాయట. అయితే ఇక్కడ 'కెజిఎఫ్ 2' ని మర్చిపోకూడదు. అయితే మే 30 లేదా జులై ఆఖరికి వెళ్లే దిశగా హోంబాలే టీమ్ డిస్కషన్స్ లో ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకునే ఆలోచనలో లేరు.

ఇక మోస్ట్ వెయిటెడ్ ప్రభాస్ 'రాధే శ్యామ్' విషయంలో ఇంకాస్ సందిగ్దత కొనసాగుతూనే ఉంది. కనీసం టీజర్ హింట్ కూడా ఇవ్వడం లేదు. రిపబ్లిక్ డే అన్నారు కానీ ప్రస్తుతానికి సూచనలు కనిపించడం లేదు. సల్మాన్ ఖాన్ 'రాధే' కూడా మల్టీ లాంగ్వేజ్ లో ఈద్ పండగ సందర్భంగా మేలోనే తీసుకొస్తారు. దీన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిందే. వెంకటేష్ 'నారప్ప' కూడా స్లాట్ కోసం చూస్తున్నాడు కానీ ఎక్కడ సెట్ అవుతుందో వేచి చూడాలి. అందరికంటే ముందు నితిన్ రంగ్ దే,రానా అరణ్యలు వచ్చి సేఫ్ అవుతున్నాయి. నాని టక్ జగదీష్ కూడా తెలివిగా డేట్ లాక్ చేసుకున్నాడు. సో మార్చ్ తో మొదలుపెడితే నాన్ స్టాప్ వినోదం మూవీ లవర్స్ కోసం ఎదురు చూస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp