డిసిపి ఆదిత్య చెప్పిన 'వి'శేషాలు

By iDream Post Sep. 05, 2020, 03:41 pm IST
డిసిపి ఆదిత్య చెప్పిన 'వి'శేషాలు

నిన్న డైరెక్ట్ ఓటిటి రిలీజ్ గా వచ్చిన నాని సుధీర్ బాబుల మల్టీ స్టారర్ 'వి'ని ప్రేక్షకులు భారీ ఎత్తున చూస్తున్నారని వ్యూస్ ని బట్టి, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులను చూస్తే అర్థమవుతోంది. టాక్ ఎలా ఉందనే సంగతి పక్కనబెడితే స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఇంత భారీ మూవీ ఇలా నేరుగా ఇంటికే వచ్చేయడం మాత్రం ఆడియన్స్ థ్రిల్ గా ఫీలవుతున్నారు. వ్యయప్రయాసలు కూర్చి థియేటర్ దాకా వెళ్లే అవసరం లేకుండా వినోదం ఇలా అందివస్తే ఆనందపడని వారు ఎవరు ఉంటారు. అందుకే వి రెస్పాన్స్ ని టీమ్ ఎంజాయ్ చేస్తోంది. దీని గురించి ఇందులో డిసిపి ఆదిత్యగా నటించిన సుధీర్ బాబు చాలా విశేషాలే పంచుతున్నారు.

సమ్మోహనం సూపర్ సక్సెస్ తర్వాత సుధీర్ బాబు తాను అప్పటికే కొనిపెట్టుకున్న ఓ బయోపిక్(పుల్లెల గోపిచంద్ ది కాదు)ని హ్యాండిల్ చేయగలరా అని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణను అడగటం జరిగింది. అయితే అప్పటికే వి కథను ఒక షేప్ కు తీసుకొస్తున్న ఆయన దానికన్నా ముందు ఇది చూడమని స్క్రిప్ట్ ని వినిపించారు. అప్పటికే తనకో పెద్ద హిట్టు ఇచ్చిన అభిమానంతో ఆయన ఏ కథ చెప్పినా ఓకే చేద్దామనుకున్న సుధీర్ ఏకంగా థ్రిల్లింగ్ స్టోరీ చెప్పడంతో ఇక నో చెప్పడానికి ఏ కారణం కనిపించలేదు. అందులోనూ నాని నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని ఎంచుకుని ఛాలెంజ్ స్వీకరించాడు కాబట్టి మిగిలింది తాను పూర్తి చేయాలనీ డిసైడ్ అయిపోయారు.

ఇక ఆర్టిస్టుల నుంచి బెస్ట్ రాబట్టుకోవడంలో నేర్పరి అయిన ఇంద్రగంటి వర్కింగ్ స్టైల్ ని ఇష్టపడిన సుధీర్ బాబు వెంటనే వి కోసం రెడీ అయిపోయారు. ఒక సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ చేసే పోరాటాన్ని ముందే ఊహించుకున్న వైనం ఫైనల్ గా నానితో జోడి కట్టేలా చేసింది. ఇక ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితిలో అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థ ద్వారా 200 దేశాల్లో విడుదల కావడం వల్ల ఎక్కువ ప్రేక్షకులకు రీచ్ అవుతుందన్న సుధీర్ బాబు ఆ నిర్ణయం పట్ల సంతోషంగానే ఉన్నారు. ఇప్పటిదాకా చేసిన వాటిలో ప్రేమకథలతో పాటు డిఫరెంట్ జానర్స్ ట్రై చేసిన ఈ హీరోకు విలోని డిసిపి ఆదిత్య పాత్ర మంచి పేరే తీసుకొచ్చేలా ఉందని ఇప్పటికే సినిమా చూసేసిన పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp