దగ్గుబాటి హీరో ప్రేమపెళ్లి కథ

By iDream Post May. 23, 2020, 12:14 pm IST
దగ్గుబాటి హీరో ప్రేమపెళ్లి కథ

లాక్ డౌన్ వేళ టాలీవుడ్ పెళ్లి వార్తలతో సందడి సందడిగా ఉంది. షూటింగులు లేని ఈ ఖాళీ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వినియోగించుకుంటున్నారు. ఇటీవలే నిఖిల్, దిల్ రాజు, రంగస్థలం మహేష్ ల పెళ్లిళ్లు నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. నితిన్ చేసుకోబోయే ఈవెంట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. సడలింపులు పూర్తిగా ప్రకటించిన తర్వాత నితిన్ ఫ్యామిలీ ఓ నిర్ణయం తీసుకోబోతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే దగ్గుబాటి హీరో రానా మ్యారేజ్ ఇప్పుడు కొత్త హాట్ టాపిక్ గా మారింది. ఉరుము ఉరిమినట్టు మూడు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా తన కాబోయే భార్య మిహికా బజాజ్ ను పరిచయం చేయడం అందరికీ స్వీట్ షాక్ ని ఇచ్చింది .

మొన్నే రోకా వేడుకను చేసుకుని ఫోటోలు కూడా మీడియాకు విడుదల చేశారు. చూడచక్కగా ఉన్న జంటను చూసి అందరూ ఆనందపడ్డారు. అయితే తన ప్రేమ ఎలా మొదలయ్యిందన్న కథను నిన్న రానా ఇన్స్ టా లైవ్ లో మంచు లక్ష్మితో షేర్ చేసుకున్నాడు. వీళ్ళ లవ్ స్టొరీకి లింక్ వెంకటేష్ ఫ్యామిలీలో ఉందట. చిన్నాన్న వెంకీ పెద్ద కూతురు ఆశ్రిత, మిహికా ఇద్దరూ క్లాస్ మేట్స్. ఎప్పటి నుంచో స్నేహం ఉంది. రాకపోకలు జరుగుతూ ఉండేవి. రానా, తను ఇద్దరూ మాట్లాడుకునే వారు. కాని తమకు తెలియకుండానే లోలోపల ప్రేమ చిగురిస్తోందన్న విషయం చాలా ఆలస్యంగా గుర్తించారు. ముందు పసిగట్టింది రానానే.

తన జీవిత భాగస్వామిలోని లక్షణాలు మిహికాలో ఉన్నాయని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లాక్ డౌన్ అమలుకు కొద్దిరోజుల ముందే ప్రపోజ్ చేశాడు. ముందు ఆశ్చర్యపోయినా రానాలోని సిన్సియారిటీని గుర్తించిన మిహికా వెంటనే ఎస్ అనేసింది. అంటే రానా ఇన్ డైరెక్ట్ గా అంతకు ముందు కొన్ని ట్రైల్స్ వేశాడన్న మాట. బాహుబలిలో భల్లాలదేవా లాగా ఇక్కడ చెలాయించడం కుదరదు కాబట్టి తానూ ఒక సగటు ప్రేమికుడిలా సరైన రీతిలో వ్యక్తపరిచి మిహికా మనసు గెలుచుకున్నాడు. అయితే పెళ్లి గ్రాండ్ గా జరుగుతుందా లేదా ఈ మధ్య కాలంలో చూసినట్టు సింపుల్ గా కానిస్తారా అనే ప్రశ్నకు మాత్రం ప్రస్తుతానికి సమాధానం లేదట

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp