నిశ్శబ్దం వెనుక పెద్ద కథే ఉంది

By iDream Post Sep. 23, 2020, 05:52 pm IST
నిశ్శబ్దం వెనుక పెద్ద కథే ఉంది

ఇంకో 7 రోజుల్లో మరో టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ నిశ్శబ్దం ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజ్ కాబోతోంది. నాని వి తర్వాత ఆ స్థాయిలో అంచనాలున్న సినిమా ఇదే. భాగమతి తర్వాత రెండేళ్ల గ్యాప్ తో అనుష్క చేసిన మూవీ కావడంతో అభిమానుల్లోనూ దీని మీద ప్రత్యేక ఆసక్తి నెలకొంది. దీని తర్వాత స్వీటీ సినిమాలు కంటిన్యూ చేస్తుందో లేదో తెలియని పరిస్థితిలో ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. దర్శకుడు హేమంత్ మధుకర్ సైతం దీంతోనే తన క్యాలిబర్ ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. గతంలో అతను తీసిన వస్తాడు నా రాజు ఫలితం దెబ్బకు చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హిందీలో ఓ 3డి సినిమా తీశాడు కానీ అదీ నష్టాలనే మిగిల్చింది.

ఆ టైంలో రాసుకున్నదే నిశ్శబ్దం. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. ముందు ఇది పుష్పక విమానం తరహాలో మూకీ సినిమాగా తీద్దామనుకున్నారు. మాధవన్ కు మొదట చెప్పినప్పుడు ఆయనకు విపరీతంగా నచ్చేసి ఎంకరేజ్ చేశారు. తాప్సీని హీరోయిన్ గా ప్లాన్ చేసుకున్నారు. పివిపి లాంటి పెద్ద బ్యానర్ ప్రొడక్షన్ కు ముందుకు వచ్చింది. అయితే అంత వేగంగా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. ఇలా ఆలస్యమవుతున్న టైంలో కోన వెంకట్ కు మధుకర్ ఈ స్టోరీని వినిపించాడు. ఆయనకు సింగల్ సిట్టింగ్ లో నచ్చేసింది. ఇలా సైలెంట్ మూవీగా తీస్తే ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్లడం తప్ప కమర్షియల్ గా వర్కవుట్ కాదని హీరోయిన్ పాత్రకు మాత్రమే మాటలు తీసేసి మిగిలిందంతా టాకీ వెర్షన్ ఆయనే స్వయంగా రాశారు.

అనుష్కకి చెప్పడం వెంటనే ఒప్పేసుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతగా నచ్చింది కాబట్టి కోన వెంకట్ రచనతో పాటు నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. క్యాస్టింగ్ కూడా రిచ్ గా కుదిరింది. బ్యాక్ డ్రాప్ ని కంప్లీట్ గా అమెరికాకు మార్చేసి షూటింగ్ మొత్తం అక్కడే తీసుకున్నారు. ఇలా చేతులు మారిన నిశ్శబ్దం అనుకున్న టైం కన్నా ఆలస్యంగా పలుమార్లు వాయిదా పడుతూ ఏప్రిల్ లో రిలీజ్ ను ప్లాన్ చేసుకుంటే లాక్ డౌన్ వల్ల ఆఖరికి డిజిటల్ రూపంలో విడుదల కావాల్సి వస్తోంది. ఏదేమైనా ఇప్పుడిది పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం చాలా అవసరం. అసలే ఓటిటిలోనూ గొప్పగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రావడం లేదని ప్రేక్షకులు నిరాశతో ఉన్నారు. నిశ్శబ్దం అయినా దానికి చెక్ పెడుతుందేమో చూద్దాం. అసలు మాటలే లేకుండా స్వీటీ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో ఆసక్తి రేపేదే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp