సర్కార్ పాడేశాడు - అఫీషియల్

By iDream Post May. 31, 2020, 10:22 am IST
సర్కార్ పాడేశాడు - అఫీషియల్

సూపర్ స్టార్ మహేష్ బాబు - గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోయే సర్కారు వారి పాట టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ప్రీ లుక్ ఇవాళ రిలీజ్ చేశారు. కృష్ణ గారి జన్మదినం సందర్భంగా అభిమానులకు ఈ కానుక ఇచ్చారు. నిజానికి ఇది మూడు రోజుల క్రితమే లీకైంది. బయటికి ఎలా వెళ్లిందని మహేష్ తన టీమ్ మీద కోప్పడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. అందుకే ఒక రకంగా యాంగ్జైటి కొంచెం తగ్గిందనే చెప్పాలి. పోస్టర్ విడుదల చేశారు కానీ అందులో మహేష్ బాబు కంప్లీట్ లుక్ లేదు.

కేవలం చెవి, దానికి పోగు, మెడమీద రూపాయి బిళ్ళ టాటూ, ఫంకీగా అనిపిస్తున్న బ్యాక్ హెయిర్ స్టైల్. వీటినే పొందుపరిచారు తప్ప ఫ్రంట్ నుంచి మహేష్ లుక్ ఎలా ఉంటుందనే సీక్రెట్ ని మాత్రం బయట పెట్టలేదు. ఇది కేవలం ప్రకటనే కాబట్టి ఇలా పరిమితం చేశారు అనుకోవచ్చు. మొత్తానికి సినిమాలో డిఫరెంట్ కంటెంట్ ఉందనేలా డిజైన్ చేయడం విశేషం. సంగీత దర్శకుడిగా తమన్ ని తీసుకున్నారు. గత మూడు సినిమాలుగా దేవి శ్రీ ప్రసాద్ కే ఫిక్స్ అయిపోయిన మహేష్ బాబు ఈ సారి ట్రెండ్ ని ఫాలో అయిపోయాడు. భీభత్సమైన ఫాంలో ఉన్న తమన్ కే ఓటు వేశారు.

ముందు గోపి సుందర్ పేరు వినిపించింది కాని అభిమానులు కోరుకున్నట్టు తమన్ కే ఛాన్స్ దక్కింది. గతంలో ప్రిన్స్ కి దూకుడు, బిజినెస్ మెన్ లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తమన్ ఈసారి హీరో ఫ్యాన్స్ అంచనాలు ఏ రేంజ్ లో అందుకుంటాడో వేచి చూడాలి. సర్కారు వారి పాటకు మూడు నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం తీసుకుంటున్నాయి. మహేష్ స్వంత బ్యానర్ తో పాటు 14 రీల్స్, మైత్రి ఇందులో పార్ట్ నర్స్ గా ఉంటాయి. హీరొయిన్ గా కీర్తి సురేష్ ఫైనల్ అయినట్టుగా టాక్. ప్రభుత్వ విధి విధానాలు వచ్చాక షూటింగు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో తెలుస్తుంది. వేలం పాట మాటనే టైటిల్ గా పెట్టుకున్న సర్కారు వారి పాట ప్రీ లుక్ తోనే అంచనాలు పెంచే పనిని మొదలుపెట్టెసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp