బోనీ ని ఎందుకు పెళ్లి చేసుకున్నా నా అని శ్రీదేవి భాధపడేది

By Nagesh Feb. 27, 2018, 02:49 pm IST
బోనీ ని ఎందుకు పెళ్లి చేసుకున్నా నా అని శ్రీదేవి భాధపడేది

బోనీ ని ఎందుకు పెళ్లి చేసుకున్నా నా అని శ్రీదేవి భాధపడేది, తెరమీద నవ్వుతూ కనిపించిన ఆమె జీవితం అంతా భాధలే : శ్రీదేవి చిన్నాన్న వేణుగోపాల్ రెడ్డి

తెర మీద నవ్వుతూ కనిపించే అందాల నటి, అతి లోక సుందరి శ్రీదేవి నిజ జీవితం అంతా బాధల మయమే నని ఆమె చిన్నాన్న వేణుగోపాల్ రెడ్డి ఆవేదన చెందారు. చిన్నతనం లో తన చేతుల్లో ఎత్తుకున్న శ్రీదేవి కి ఈ రకమైన చావు వస్తుందని ఊ హించలేదన్నారు. బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుని తప్పు చేశానని ఆమె పశ్చాత్తాపం పడ్డారని వివరించారు. ఐ డ్రీమ్ ప్రతినిధి నగేష్ కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బోనీ కపూర్.చేసిన అప్పులు తీర్చడం కోసం శ్రీదేవి చెన్నై లోని తన ఆస్తులు అమ్మేసిందన్నారు. తన ఇద్దరు బిడ్డలకు మంచి భవిష్యతు ఇవ్వాలనే లక్ష్యం తోనే ఇంగ్లిష్ - వింగ్లిష్ సినిమా ద్వారా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిందని ఆయన.తెలిపారు. బోనీ కపూర్ తమతో మర్యాదగా ప్రవర్తించే వారని , భార్య, భర్తల మధ్య గొడవలు ఏవైనా ఉన్నాయేమో తనకు తెలియదన్నారు. శ్రీదేవి హిందీ సినిమాల్లోకి పోయే వరకూ బంధువులతో తరచూ కలిసేవారన్నారు. బోణీ ని పెళ్లి చేసుకుని ముంబైలో స్థిరపడ్డాక ఏడాదికి ఒక సారి మాత్రం (ఆగస్ట్ 13న)  తప్పకుండా తిరుమలకు వస్తూ ఉండేదన్నారు. తమను కూడా తిరుమల దర్శనానికి  తీసుకుని వెళ్లి తిరుపతి హోటల్ లో డిన్నర్ ఇచ్చేదని వేణుగోపాల్ చెప్పారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp