క్రేజీ రియాలిటీ షో సభ్యులు లీక్ అయ్యారా ?

By iDream Post Aug. 22, 2021, 11:49 am IST
క్రేజీ రియాలిటీ షో సభ్యులు లీక్ అయ్యారా ?

త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 5 షో కోసం రంగం సిద్ధమవుతోంది. నాగార్జున యాంకరింగ్ చేస్తారా లేదా అనే అనుమానాలకు చెక్ పెడుతూ ఇటీవలే ఒక యాడ్ తో ప్రమోషన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనేది ఇంకా రివీల్ చేయలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు వచ్చే రెస్పాన్స్ ని బట్టి దానికి పోటీగా టైం డిసైడ్ చేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్. వివాదాలతోనే ఎక్కువగా ఆకట్టుకునే బిగ్ బాస్ 5 ని గత సీజన్ల కంటే బెటర్ గా ఉండేలా ఈసారి స్క్రిప్ట్ లో ఏవో మార్పులు చేస్తారనే ప్రచారం ఉంది కానీ అదెంత వరకు నిజమో షో మొదలయ్యాక కానీ అర్థం కాదు.

ఇందులో పాల్గొనబోయే పార్టిసిపెంట్స్ కి సంబంధించిన లీక్స్ కూడా అప్పుడే మొదలైపోయాయి. టీవీ9 యాంకర్ ప్రత్యుష, యాంకర్ కం ఆర్టిస్ట్ రవి, సీనియర్ నటి ప్రియా, యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, యూట్యూబ్ లో పాపులరైన సిరి హనుమంతు, ఆర్జె కాజల్, టాటూల సెలబ్రిటీ లోబో, నృత్య దర్శకురాలు యానీ, సీరియల్ ఆర్టిస్ట్ సన్నీ, ప్రేమ కావాలి హీరోయిన్ ఈషా చావల్, ప్రియాంకా, జ్యోతి, శ్వేతా, లహరి, మానస్, సీనియర్ నటీమణి ఉమా తదితరులు ఈ లిస్ట్ లో ఉన్నారట. వీళ్ళలో ఎవరు ఫైనల్ అయ్యారు ఎవరు నో చెప్పారు అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. వీళ్ళతో సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమేనట.

షో మొదలయ్యే దాకా స్టార్ మా ఛానల్ వీటిని అఫీషియల్ చేయదు. నేరుగా ఫస్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే. గతంలోనూ ఇలా లీకైనవి నిజమైన సందర్భాలు ఎక్కువ. అయితే పైన చెప్పిన పేర్లలో సామాన్య జనానికి తెలిసిన వాళ్ళు కొందరే. సోషల్ మీడియాలో నిత్యం మునిగి తేలే వారికి ఐడియా ఉంటుంది కానీ మిగిలినవాళ్లు డౌటే. గత నాలుగు సీజన్లకు మంచి స్పందన వచ్చినప్పటికీ హిందీ తమిళ బిగ్ బాస్ తో పోలిస్తే మనది ఆ స్థాయిలో హిట్ కావడం లేదు. పైగా ముగ్గురు యాంకర్లు మారడం కూడా కారణం అయ్యింది. ఇక ఇప్పుడు షో నడిచినన్ని సీజన్లు దీన్ని నాగార్జునే హోస్ట్ చేయడం మాత్రం కన్ఫర్మే

Also Read: ఒకేసారి మూడు సినిమాల సందడి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp