Small Releases : వచ్చే వారం బడ్జెట్ చిత్రాల భారీ యుద్ధం

By iDream Post Oct. 17, 2021, 10:15 am IST
Small Releases : వచ్చే వారం బడ్జెట్ చిత్రాల భారీ యుద్ధం

మొత్తానికి బాక్సాఫీస్ కుదుటపడుతోంది. సెకండ్ లాక్ డౌన్ తర్వాత జనాలు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ మీడియం రేంజ్ సినిమాలకు మంచి వసూళ్లు అందిస్తూ వాటిని ఒడ్డున పడేస్తున్నారు. రిలీజైన ప్రతి చిత్రం సక్సెస్ కాలేదు కానీ మినిమమ్ కంటెంట్ ఉంటే చాలు పాస్ అయినవి గట్టిగానే ఉన్నాయి. మొన్న దసరాకు వచ్చిన మహా సముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి పండగను క్యాష్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. రేపటి నుంచి పరిస్థితి ఎలా ఉండబోతోందనే దాన్ని బట్టి వీటి ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. వీటిని చూసేసిన వాళ్ళ కళ్ళు ఇప్పుడు అక్టోబర్ 22 మీదకు వెళ్ళిపోతోంది.

వచ్చే శుక్రవారం అన్నీ చిన్న సినిమాల యుద్ధం జరగబోతోంది. దేని మీద భారీ హైప్ లేదు. టాక్ ని బట్టి కలెక్షన్లను పెంచుకోవాల్సిందే. మొన్నటి దాకా ఎవరికీ అంతగా తెలియని 'నాట్యం' సినిమా తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిన్న రామ్ చరణ్ ముఖ్య అతిధిగా రావడంతో అంతో ఇంతో బజ్ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ ప్రమోట్ చేస్తున్నాడంటే విషయం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన 'మధుర వైన్స్' యూత్ ని టార్గెట్ చేసుకుంది. టైటిల్ కూడా టెంప్ట్ చేసేలా ఉంది. 'అసలేం జరుగుతోంది' వెరైటీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేసుకుంటుండగా 'క్లిక్' అనే మరో మూవీ కూడా బరిలో ఉంది.

వీటికి ఓపెనింగ్స్ ని ఆశించలేం. పబ్లిక్ టాక్, రివ్యూలు కీలకంగా మారబోతున్నాయి. మళ్ళీ 29న వరుడు కావలెను వచ్చే దాకా స్పేస్ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇవి ఎంత మేరకు ఉపయోగించుకుంటాయో వేచి చూడాలి. థియేటర్లకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్న తరుణంలో ఇప్పుడు కంటెంట్ కీలకంగా మారుతోంది. యావరేజ్ ఇచ్చినా పర్లేదు చూస్తామని ఆడియన్స్ అంటున్నారు కానీ ఎటొచ్చి మరీ వీక్ గా అనిపించేవి మాత్రం వారం లోపే టపా కట్టేస్తున్నాయి. సరైన పెద్ద సినిమా రావాలే కానీ రెండు మూడు వారాల పాటు హౌస్ ఫుల్ బోర్డులు పడే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఇప్పటికైతే అలాంటి క్రేజీ అనౌన్స్ మెంట్ ఇంకా రానేలేదు

Also Read : MAA President : మా' స్వీకారం పూర్తి - అసలు సవాళ్లు ఇప్పుడే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp