'సలార్'లో శృతి - కారణమిదేనా

By iDream Post Jan. 28, 2021, 02:31 pm IST
'సలార్'లో శృతి - కారణమిదేనా

రాధే శ్యామ్ పూర్తి కావొస్తున్న తరుణంలో ప్రభాస్ తన సినిమాల స్పీడ్ పెంచాడు. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందబోయే నాగ అశ్విన్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే లోపు సలార్, అది పురుష్ లను వీలైనంత త్వరగా ఫినిష్ చేసేలా చాలా వేగంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన సలార్ రేపటి నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ ఎంపిక కావడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఏ దిశా పటానినో లేదా కియారా అద్వానీనో సెట్ చేస్తారనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చారే అని అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

నిజానికి దీని వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది సలార్ చాలా వేగంగా పూర్తి చేయాలి. అయితే కోరినన్ని డేట్స్ ఇచ్చే హీరోయిన్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఒకవేళ బాలీవుడ్ నుంచి ఎవరినైనా తీసుకొచ్చినా ప్రాజెక్ట్ లేట్ అయితే దానికి తగ్గట్టు కాల్ షీట్ ఇబ్బందులు వస్తాయి. శృతి హాసన్ కు ఆఫర్లు ఎలా ఉన్నా ఈ విషయంలో మరీ భారీ డిమాండ్ అయితే లేదు. అందులోనూ తెలుగులో స్టార్ హీరోలతో తను చేసిన ఫస్ట్ టైం కాంబోలన్నీ ఎక్కువ శాతం బ్లాక్ బస్టర్లే. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, రవితేజ బలుపు, మహేష్ బాబు శ్రీమంతుడు కొన్ని ఉదాహరణలు మాత్రమే. రామయ్య వస్తావయ్యా లాంటి షాకులు లేకపోలేదు.

అందులోనూ సలార్ అవుట్ అండ్ అవుట్ హీరోయిజం ఎలివేట్ చేసే మాస్ మసాలా కమర్షియల్ సబ్జెక్టు. ఇందులో హీరోయిన్ పాత్రకు మరీ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనుకోవడానికి లేదు. కెజిఎఫ్ ని పదుల సార్లు చూసిన వీరాభిమానులు కూడా ఠక్కున హీరోయిన్ పేరు చెప్పమంటే కొంత ఆలోచించడం ఖాయం. అందుకే సలార్ విషయంలో ఎక్కువ టెన్షన్ పడలేదట. వీలైతే ఈ ఏడాదిలోనే రాధే శ్యామ్ తర్వాత దీన్నే విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ బ్రాండ్ తోడవ్వడంతో సలార్ కు బిజినెస్ ఆఫర్స్ చాలా క్రేజీగా వస్తున్నాయి. రిలీజ్ గురించి కూడా మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp