ఇద్దరు యువకుల యుద్ధంలో గెలుపు ఎవరిది

By iDream Post Sep. 23, 2021, 06:30 pm IST
ఇద్దరు యువకుల యుద్ధంలో గెలుపు ఎవరిది

శర్వానంద్-సిద్దార్థ్ కలయికలో అజయ్ భూపతి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా మహా సముద్రం. వచ్చే నెల 14న గ్రాండ్ రిలీజ్ రెడీ కాబోతున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించిన ఈ లవ్ కం యాక్షన్ డ్రామా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. గతంలో ఇతర హీరోల కాంబోలో దీన్ని తీసేందుకు ట్రై చేసిన అజయ్ భూపతి ఫైనల్ గా క్రేజీ కాంబినేషనే సెట్ చేసుకున్నారు. తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు తగ్గించేసిన సిద్దార్థ్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఇది మంచి పునాదవుతుందనే అంచనాలు ఉన్నాయి. శర్వానంద్ కూడా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందాకే దీని ట్రైలర్ ని రిలీజ్ చేశారు

అనగనగా ఒక సముద్రం. ఇద్దరు యువకుల(శర్వానంద్-సిద్దార్థ్)జీవితాలు అక్కడ ముడిపడి ఉంటాయి. ప్రేమకథలు నడిపిస్తూ ప్రియురాళ్ళు(అదితి రావు హైదరి-అను ఇమ్మానియేల్)తో గడుపుతూ ఉంటారు. అయితే వీళ్ళ వెనుక ఒక అలజడి ఉంటుంది. ఏవో కారణాల వల్ల వేరు పడతారు. ఒకరి చావు కోసం మరొకరు వెంటపడేలా పరిగెత్తుతారు. ప్రతినాయకులు(జగపతిబాబు-రావు రమేష్) పన్నిన వలలో చేపలా మారతారు. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మరి ఈ నలుగురి ప్రయాణం ఏ మజిలీకి చేరుకుంది, పోర్టులో మొదలైన యుద్ధం ఎవరిని బలి కోరింది ఎవరిని ఉంచింది లాంటి ప్రశ్నలు సమాధానమే సినిమా

వీడియోలో విజువల్స్ బాగున్నాయి. కథలోని ఇంటెన్సిటీని తెరమీద అజయ్ భూపతి ఆవిష్కరించిన తీరు ఆకట్టుకునేలా సాగింది. క్యారెక్టరైజేషన్లు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. రాజ్ తోట ఛాయాగ్రహణం, చైతన్ భరద్వాజ్ నేపధ్య సంగీతం పోటీ పడ్డాయి. మొత్తానికి అంచనాలు రేపడంలో మహా సముద్రం టీమ్ సక్సెస్ అయ్యింది. అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం జగపతిబాబు సముద్రం, మొన్నామధ్య ఉప్పెనలు తప్ప పూర్తిగా అలాంటి బ్యాక్ డ్రాప్ లో పెద్దగా సినిమాలు రాలేదు. ఇప్పుడీ మహా సముద్రం చూస్తుంటే ఆసక్తి పెంచేలా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదల కాబోతున్న మహాసముద్రం మంచి సీరియస్ డ్రామా అనే నమ్మకాన్ని కలిగించింది.

Also Read : వాణివిశ్వనాథ్ కూతురు హీరోయిన్ అయ్యిందే.. !

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp