సర్కారు పని బ్యాంకులోనే

By iDream Post Jun. 27, 2020, 02:50 pm IST
సర్కారు పని బ్యాంకులోనే

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందబోయే సర్కారు వారి పాట ఎప్పుడెప్పుడు మొదలవుతుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో కరోనా ఇంకా పూర్తిగా కట్టడి కాకపోవడంతో స్టార్లు సెట్ లో అడుగు పెట్టేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు టీవీ షూటింగ్స్ లో నటులకు వైరస్ సోకుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. దీని సంగతి ఎలా ఉన్నా తమన్ మాత్రం ట్యూన్స్ ని ఇంటి నుంచే కంపోజ్ చేయడం మొదలుపెట్టినట్టుగా తెలిసింది. నిన్నే వంద రోజు ఇంట్లో ఉన్నానంటూ తమన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయ్యింది. ఇదిలా ఉండగా మరో హాట్ అప్ డేట్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది.

దాని ప్రకారం సర్కారు వారి పాటలో కీలక భాగం బ్యాంకు బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందట. బడా బాబులు చేసే మోసాలు, రుణాలు తీసుకుని విదేశాలకు చెక్కేసే వాళ్ళ ఎత్తుగడలు చాలా వినూత్న రీతిలో చూపించబోతున్నట్టు తెలిసింది. అయితే మహేష్ బ్యాంకు ఉద్యోగి కాదట. ఏంటనే ప్రశ్నకు మాత్రం ప్రస్తుతానికి సమాధానం లేదు. హీరొయిన్ గా కీర్తి సురేష్ ఫిక్స్ అయినట్టుగా ప్రచారం జోరుగా జరుగుతోంది కాని సదరు ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం షూటింగులు స్తంభించిపోయిన నేపధ్యంలో అందరు దర్శక నిర్మాతలకు కాల్ షీట్స్ సర్దుబాటు పెద్ద సమస్యగా మారింది.

ముందు ఎప్పుడు మొదలవుతాయో క్లారిటీ ఉంటే ఫలానా డేట్స్ కి హీరో హీరొయిన్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కాని పెండింగ్ లో ఉన్న సినిమాలకు ఎన్ని తేదీలు అవసరమవుతాయో చూసుకుని ఆ తర్వాతే కొత్త వాటికి కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు పైకి కనిపించకపోయినా తర్వాత ఇది చిన్న సమస్యగా మాత్రం ఉండబోదు. అందుకే కీర్తి సురేష్ ని ప్రాధమికంగా లాక్ చేసినా ఇంకా మీడియాకు అఫీషియల్ గా న్యూస్ ని రిలీజ్ చేయలేదు. ఇంకో హీరొయిన్ ఉంటుందన్నారు కాని తను ఎవరో ఇంకా క్లూ కూడా బయటికి రాలేదు. మొత్తానికి ఫస్ట్ లుక్ తోనే సర్ప్రైజ్ ఇచ్చిన సర్కారు వారి పాట ముందు ముందు మరిన్ని సంగతులు మోసుకొచ్చేలా ఉంది. 2021 సమ్మర్ కంటే ముందు సర్కారు వారి పాట వచ్చే ఛాన్స్ లేనట్టే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp