సంక్రాంతి పోటీకి సరైన కిక్కు

By iDream Post Jul. 31, 2021, 04:35 pm IST
సంక్రాంతి పోటీకి సరైన కిక్కు

2022 సంక్రాంతికి ఇప్పటి నుంచే వాతావరణం వేడెక్కుతోంది. నిన్న ప్రభాస్ రాధే శ్యామ్ ప్రకటన వచ్చిన రోజున్నరలోనే మహేష్ బాబు సర్కారు వారి పాట టీమ్ తమ డేట్ ని లాక్ చేసుకుంది. దాని కన్నా ముందు జనవరి 13న థియేటర్లలో రాబోతున్నట్టు ఇందాకా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రకటించింది. సో అఫీషియల్ గా ఇద్దరు తమ తేదీలను లాక్ చేసుకున్నారన్న మాట. ఇంకా పవన్ కళ్యాణ్ రానా మూవీ, ఎఫ్3 లు తమ డేట్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది. 2020 సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ మళ్ళీ జనవరిలో పండగనే టార్గెట్ చేసుకోవడం విశేషం. రెండేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా ఉండబోతున్నాయి.

గీత గోవిందం తర్వాత చాలా గ్యాప్ వచ్చేసిన దర్శకుడు పరశురామ్ కు సర్కారు వారి పాట విజయం చాలా కీలకం. ఈ ప్రాజెక్టు కోసమే ఏళ్ళ తరబడి వేచి చూసి మరీ అవకాశాన్ని అందుకున్నాడు. అందులోనూ బడ్జెట్ పరంగా ఇమేజ్ పరంగా మార్కెట్ పరంగా ఇలా ఏ కోణంలో చూసుకున్నా ఇది తనకు చాలా పెద్ద మూవీ. హైప్ ని అందుకుని సక్సెస్ అయ్యాడంటే వెంటనే టాప్ లిస్టులోకి వెళ్ళిపోతాడు. తన టార్గెట్ కూడా అదే. దీంతో కనక ప్రూవ్ చేసుకుంటే ఇండస్ట్రీలో అగ్ర హీరోల నుంచి వద్దన్నా ఆఫర్లు క్యూ కడతాయి. అగ్ర నిర్మాణ సంస్థలు వెంటపడతాయి. ఎలాంటి కాంబినేషన్ అయినా సెట్ చేసుకోవచ్చు.

ఈ లెక్కన సర్కారు వారి పాట ఇప్పుడు చేతిలో ఉన్న అయిదు నెలల్లో మొత్తం పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. ఇటీవలే దీని ఆడియో హక్కులు నాలుగున్నర కోట్లకు అమ్ముడుపోవడం రికార్డుగా నిలిచింది. ఆచార్యను యాభై లక్షల మార్జిన్ తో ఈజీగా దాటేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ. శ్రీమంతుడు నుంచి మల్టీ మిలియనీర్ సాఫ్ట్ రోల్స్ ఎక్కువగా చేస్తున్న మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ప్రీ లుక్ నుంచి ఇవాళ్టి పోస్టర్ దాకా ఈ విషయాన్నే స్పష్టం చేశాయి. సో బాక్సాఫీస్ వద్ద నిజమైన వేలం పాటలో పాల్గొనబోతున్న ప్రిన్స్ ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో

Also Read: చరణ్ ప్రాజెక్ట్ కోసం జెట్ స్పీడ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp