2022 సంక్రాంతికి ట్రయాంగిల్ వార్

By iDream Post Jan. 30, 2021, 07:26 pm IST
2022 సంక్రాంతికి ట్రయాంగిల్ వార్

ఇంకా ఏడాది టైం ఉంది. మధ్యలో ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో మార్పులకు ఛాన్స్ ఉంది. కానీ మన నిర్మాతలు మాత్రం ఏ ఛాన్స్ ని వదిలిపెట్టడం లేదు. ఏకంగా వచ్చే సంవత్సరం పండగలకు కూడా రిలీజులు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకొకరితో క్లాష్ వచ్చి లేనిపోని ఇబ్బందులు ఎదురుకోవడం కన్నా ముందే చెప్పేసుకుని సేఫ్ అవ్వడం బెటరనే ఫార్ములాని అందరూ పాటిస్తున్నారు. దాని ఫలితంగానే ముందస్తు అనౌన్స్ మెంట్లు వస్తున్నాయి. థియేటర్లకు ఎప్పటికీ ప్రత్యాన్మాయం లేదని సంక్రాంతి బరిలో రుజువైపోవడంతో అందరికి నూతనోత్సాహం వచ్చేసింది. మాస్టర్ లాంటి బ్యాడ్ టాక్ మూవీకి పదిహేను కోట్లు రావడం కన్నా ఉదాహరణ ఇంకేం కావాలి.

ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ ని క్యాష్ చేసుకునేందుకు రెడీ అయిపోయింది. ముందు ఈ ఏడాదే వస్తుందన్నారు కానీ హడావిడిగా చేసి తేడా చేయడం ఎందుకనే ఉద్దేశంతో ఏకంగా పదకొండు నెలల టైంకి మహేష్ బాబు ఎస్ చెప్పేశాడు. దీంతో దర్శకుడు పరశురామ్ కు బెస్ట్ క్వాలిటీ అవుట్ ఫుట్ ఇవ్వడానికి కావాల్సిన టైం కన్నా ఎక్కువే దొరికేసింది. సరిలేరు నీకెవ్వరూ తర్వాత రెండేళ్ల గ్యాప్ అయినా ప్రిన్స్ ఫ్యాన్స్ ఓపికగా ఎదురు చూడక తప్పదు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ మీద అప్పుడే అంచనాలు ఎక్కువయ్యాయి.

ఇక కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ కూడా వచ్చే సంక్రాంతినే టార్గెట్ చేసుకుందట. రాధే శ్యామ్ ఇంకొంచెం ఆలస్యం అయ్యేలా ఉండటంతో తక్కువ గ్యాప్ లో రెండు ప్రభాస్ సినిమాలు రావడం కన్నా ఇలా ప్లాన్ చేసుకుంటే మంచిదనే నిర్ణయంలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎంత వేగంగా పూర్తి చేసినా కూడా రిలీజ్ మాత్రం 2022కే ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇవి కాకుండా నెల్సన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తోన్న 65వ సినిమా కూడా పొంగల్ కే తెస్తారట. సో మంచి రసవత్తరమైన ట్రయాంగిల్ పోటీ సిద్ధమన్న మాట

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp