కెజిఎఫ్ 2కు సంజు టెన్షన్

By iDream Post Aug. 13, 2020, 05:18 pm IST
కెజిఎఫ్ 2కు సంజు టెన్షన్

మొన్న లంగ్ క్యాన్సర్ స్టేజి 3 వల్ల అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారు కానీ కాస్త ఎక్కువ సమయమే రెస్ట్ అవసరం పడేలా ఉంది. కుటుంబ సభ్యులు సైతం అంత ఈజీగా బయటికి పంపించరు. డిస్ఛార్జ్ డేట్ ఇంకా డిసైడ్ కాలేదు కానీ కొంతకాలం సంజు బాబా ఇంట్లోనే ఉండక తప్పదు. ఈ నేపథ్యంలో ఇప్పుడీ పరిణామం కెజిఎఫ్ 2 యూనిట్ ని టెన్షన్ పెడుతోందని బెంగళూర్ టాక్. ఇందులో మెయిన్ విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే తనకు సంబంధించిన కీలక భాగం షూట్ చేసినప్పటికీ ఇంకొంత బాలన్స్ ఉందట.

సరిగ్గా పూర్తి చేద్దాం అనుకునే టైంలో కరోనా బ్రేక్ వచ్చి పడింది. వచ్చే నెల లేదా అక్టోబర్ లో ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడీ షాక్ లాంటి వార్త వచ్చి పడింది. అయితే ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి ఆశలు పెట్టుకోవచ్చు కానీ సంజయ్ దత్ కనక ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే మాత్రం కెజిఎఫ్ 2 టార్గెట్ పెట్టుకున్న సంక్రాంతి 2021 మిస్ అవుతుంది. యూనిట్ ఇప్పటిదాకా ఈ విషయంలో మౌనంగానే ఉంది. సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు ప్రార్ధనలు చేస్తున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని అనవసరమైన పుకార్లను నమ్మొద్దని మాన్యత దత్ నుంచి ప్రెస్ నోట్ వచ్చాక కుదుటపడ్డారు. కేజిఎఫ్ 2 పోస్ట్ ప్రొడక్షన్ కు సైతం తగినంత సమయం కావాలి.

ఒకవేళ జనవరిని లాక్ చేసుకుంటే చేతిలో కేవలం ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. పెండింగ్ ఉన్న షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్, బిజినెస్ వ్యవహారాలు అన్ని ఆ టైం ఫ్రేమ్ లోనే పూర్తి చేయాలి. సంజు రావడం ఆలస్యమైతే ఆ సీజన్ మిస్ అయిపోయి మళ్ళీ వేసవికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటికే దానికి విపరీతమైన పోటీ నెలకొంది. అందుకే ఈ అధీరా పూర్తిగా కోలుకునే దాకా ఏదీ చెప్పలేని పరిస్థితి. రవీనాటాండన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు వందల కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ అంచనా. వ్యాక్సిన్ త్వరగా వచ్చేస్తే క్రేజీ ప్రాజెక్టులకు డిమాండ్ ఇంకా పెరుగుతుంది. అసలే థియేటర్లు మూతబడి ఆరు నెలలు అవుతున్న తరుణంలో అవి తెరుచుకున్నాక ఇలాంటి స్టార్ సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp