Samantha: గతాన్ని వదిలేసి కెరీర్ కోసం సామ్ ప్లానింగ్

By iDream Post Oct. 13, 2021, 06:30 pm IST
Samantha: గతాన్ని వదిలేసి కెరీర్ కోసం సామ్ ప్లానింగ్

చైతుతో పెళ్లి, నాలుగేళ్ల వివాహ బంధం సమంతాకు ఇప్పుడు గతం గతః. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్, యుట్యూబ్ ఛానల్స్ తనను ఎంతగా టార్గెట్ చేసి కథనాలు ప్రచురించినా చెక్కుచెదరకుండా వాటికి ధీటుగా నిలుస్తోంది. వీటి మీదే దృష్టి పెడితే లాభం లేదని గుర్తించి ఫ్రెష్ గా కెరీర్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టబోతోంది. ఇప్పటికే గుణశేఖర్ నిర్మించి దర్శకత్వం వహించిన శాకుంతలం పూర్తి చేసిన సామ్ త్వరలో ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు చేయబోతోంది. ఓ డెబ్యూ డైరెక్టర్ తో శివలెంక కృష్ణప్రసాద్ దీన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఓ బేబీ తరహాలో తననే సెంట్రల్ సబ్జెక్టుగా తీసుకుని తెరకెక్కించబోతున్నారట.

ఇది కాకుండా బాలీవుడ్ డెబ్యూకి సమంతా రెడీ అవుతోందని లేటెస్ట్ అప్ డేట్. ఇటీవలే ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ సంప్రదిస్తే సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 సూపర్ హిట్ అయ్యాక సామ్ కు నార్త్ లోనూ ఫాలోయింగ్ వచ్చింది. అందులో చేసింది డీ గ్లామరస్ రోల్ కాబట్టి తనలో అసలు షేడ్స్ ని నార్త్ వాళ్లకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో సమంతా ఉంది. ఇటీవలే ఎవరు మీలో కోటీశ్వరుడు కోసం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేసిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తో కొంచెం గ్యాప్ తర్వాత సామ్ స్క్రీన్ షేర్ చేసుకున్నది దీంతోనే. ఆల్రెడీ ప్రోమోలు కూడా బాగానే హల్చల్ చేస్తున్నాయి.

సమంతా తమిళంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి చేసిన కాతు వకుల రెండు కాదల్ విడుదలకు సిద్ధంగా ఉంది. సోనీ లివ్ లో డైరెక్ట్ రిలీజ్ అంటున్నారు కానీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇవి కాకుండా మరికొన్ని వెబ్ సిరీస్ ల ప్రతిపాదనలు కూడా సామ్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. పరిశ్రమలో పెళ్లిళ్లు విడాకులు సహజమే అయినప్పటికీ సోషల్ మీడియా ప్రభావం వల్ల చైతు సమంతల వ్యవహారానికి అవసరానికి మించిన ప్రాధాన్యం దక్కింది. ఆఖరికి ఆమె స్టయిలిస్ట్ కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఏదైతేనేం కెరీర్ ని స్ట్రాంగ్ గా మలచుకుంటే జనం ఇదంతా త్వరగానే మర్చిపోతారు

Also Read : తెలుగు బ్లాక్ బస్టర్లకు రీమేక్ డిమాండ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp