బిజినెస్ కోసమా కంటెంట్ కోసమా

By iDream Post Jun. 21, 2021, 04:00 pm IST
బిజినెస్ కోసమా కంటెంట్ కోసమా

అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ మొదలయ్యే సమయానికి దర్శకుడు సుకుమార్ మనసులో దీన్ని రెండు భాగాలుగా తీయాలన్న ఆలోచన లేదు. సింగల్ మూవీకి అనుగుణంగానే స్క్రిప్ట్ రాసుకున్నారు. హీరోని ఒప్పించారు. బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ తీరా సెట్స్ పైకి వెళ్ళాక, చిన్న టీజర్ కు వచ్చిన స్పందన చూశాక అప్పటి దాకా తీసిన రషెస్ ని బట్టి దీనికి సీక్వెల్ తీయడమే మంచిదని అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి ప్రకటించారు. నిజానికి సెకండ్ పార్ట్ కోసం ఇంకా కంప్లీట్ వెర్షన్ సుకుమార్ రాయనే లేదట. అందుకే ఇప్పటికిప్పుడు ఐకాన్ ని తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సరే దీని సంగతలా ఉంచితే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ కూడా రెండు భాగాలుగా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ప్రశాంత్ ప్రభాస్ లు సైతం దీని గురించి తీవ్రంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. బడ్జెట్ పరంగా భారం కాకుండా తాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తానని నీల్ అన్నట్టు వినికిడి. బాహుబలి, కెజిఎఫ్ లు ఈ ఫార్ములా వల్ల ఎంత లాభ పడ్డాయో ఎన్ని వందల కోట్లు అదనంగా వచ్చి పడ్డాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సలార్ కు సైతం అలాగే చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన వినడానికి బాగానే ఉంది.

కానీ ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఆది పురుష్ తర్వాత నాగ అశ్విన్ సోసియో ఫాంటసీ ప్రాజెక్ట్ ఉంది. ఇవి కాకుండా మరికొన్ని కథా చర్చలు జరుపుకుంటున్నాయి. ఇప్పుడు సలార్ ఎక్స్ టెన్షన్ అంటే కాల్ షీట్లు డేట్లు ఇదంతా పెద్ద ప్రహసనం అవుతుంది. పైగా కరోనా వల్ల రెండేళ్ల విలువైన కాలంలో ప్రభాస్ లాంటి పెద్ద హీరోల డేట్లు ఎన్నో వృధా అయ్యాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కష్టం. అందుకే దీన్ని ప్రస్తుతానికి గాసిప్ గానే తీసుకోవాలి కానీ నిజమైనా ఆశ్చర్యం లేదు. అయినా కథ డిమాండ్ చేస్తే పొడిగించాలి కానీ ఇలా లాభాలొస్తాయని చేయడం ఎంత వరకు సబబో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp