నిజమైన రిపబ్లిక్ నిర్వచనమిస్తున్న కలెక్టర్

By iDream Post Sep. 22, 2021, 11:30 am IST
నిజమైన రిపబ్లిక్ నిర్వచనమిస్తున్న కలెక్టర్

ఇటీవలే బైక్ ప్రమాదానికి గురై క్షేమంగా కోలుకుని హాస్పిటల్ నుంచి త్వరలో డిశ్చార్జ్ అయ్యేందుకు ఎదురు చూస్తున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా రిపబ్లిక్ వచ్చే నెల 1న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సీటిమార్, లవ్ స్టోరీల తర్వాత భారీ అంచనాలు మోస్తున్న చిత్రంగా దీని మీద డిస్ట్రిబ్యూటర్లకు గట్టి నమ్మకమే ఉంది. ప్రస్థానం రూపంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప పొలిటికల్ థ్రిల్లర్ ఇచ్చిన దర్శకుడు దేవకట్టా మళ్ళీ ఆ స్థాయి అవుట్ ఫుట్ ని ఇంకే మూవీలోనూ చూపించలేకపోయారు. ఇంత గ్యాప్ తర్వాత మరోసారి పవర్ ఫుల్ సబ్జెక్టు తీసుకోవడంతో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇందాకా చిరంజీవి ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా మూడు వ్యవస్థలు ప్రజల మంచిచెడులను నిర్ణయిస్తాయి. రాజకీయం, చట్టం, అధికారం. మిగిలిన రెండింటి మీద మొదటిది ఆధిపత్యం చెలాయించడం వల్ల అరాచకం పేట్రేగిపోతోంది. రిపబ్లిక్ కథ ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్నారు. ఒక నిజాయితీ కలిగిన జిల్లా కలెక్టర్(సాయిధరమ్ తేజ్)ఏకంగా ఒక ముఖ్యమంత్రి(రమ్యకృష్ణ)తోనే ఢీ కొనే పరిస్థితి వస్తుంది. అన్యాయం, దుర్మార్గం మితిమీరుతున్నప్పుడు తన అధికారాన్ని వాడుకుని జనానికి న్యాయం జరిగేలా నిజమైన రిపబ్లిక్ కు అర్థం ఏంటో తెలిసొచ్చేలా చేసేందుకు పూనుకుంటాడు. అదేంటో ఇంకో తొమ్మిది రోజులయ్యాక తెరమీద చూడాలి

ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ అయినప్పటికీ తనకు అంతగా స్కోప్ ఉందో లేదో సినిమాలో చూడాలి. ట్రైలర్ లో రెండు షాట్లకు పరిమితం చేశారు. జగపతి బాబు తన శైలికి భిన్నంగా పాజిటివ్ క్యారెక్టర్ చేసినట్టు కనిపిస్తోంది. ఆర్టిస్టులను ఎక్కువ రివీల్ చేయలేదు. తను రెగ్యులర్ గా చేసే లవ్ ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టులకు భిన్నంగా సాయి తేజ్ దీన్ని ఎంచుకోవడం మంచి ఫలితాన్ని ఇచ్చేలా ఉంది. మణిశర్మ సంగీతం, ఎం సుకుమార్ ఛాయాగ్రహణం, కెఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ ఇలా టెక్నికల్ టీమ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. జెబి ఎంటర్ టైన్మెంట్ ప్రొడక్షన్ భారీగా ఉంది. లాక్ డౌన్ తర్వాత ఇంత సీరియస్ డ్రామా ఇదే కాబట్టి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Also Read : క్రియేటివ్ దర్శకుడి క్లాసిక్ రీమేక్ వస్తోంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp