సుప్రీమ్ హీరో కూడా నాని దారిలోనే ?

By iDream Post Aug. 13, 2020, 04:18 pm IST
సుప్రీమ్ హీరో కూడా నాని దారిలోనే ?

నిన్న నాని వి ఓటిటిలో విడుదలవుతోందన్న వార్త సోషల్ మీడియాలో పెద్ద ప్రకంపనమే రేపింది. దిల్ రాజుతో సహా యూనిట్ ఎవరూ దీన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ నిప్పు లేనిదే పొగ రాదన్న సామెతను అనుసరించి నమ్ముతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దీనికి బలం చేకూర్చేలా ఎస్విసి సంస్థ తరఫున ఎవరూ ఖండించేలా ప్రెస్ నోట్ లాంటిది వదలకపోవడంతో సెప్టెంబర్లో 'వి'ని ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చని ప్రేక్షకులు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. బాలీవుడ్లో ఈ ట్రెండ్ మొదలై నెలరోజులు దాటేసింది. మన దగ్గర చిన్నా చితక తప్ప ఇంకే స్టార్ సినిమా ఓటిటిలో రాలేదు. ఇప్పుడు నాని వినే భారీ చిత్రమవుతుంది.

ఈ దారిలోనే మరికొందరు ప్రయాణం చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలిసింది. వీటిలో సాయి తేజ్ 'సోలో బ్రతుకే సో బెటరూ' ఉందట. రెండు పాటలు కొన్ని సీన్లు తప్ప షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న దీనికి షూటింగులు రీ స్టార్ట్ అయ్యాక అవి కూడా ఫినిష్ చేసేసి జై డిజిటల్ అనబోతున్నారట. ఇటీవలి కాలంలో కంటెంట్ విషయంలో తీవ్రమైన పోటీతో పాటు విమర్శలు అందుకుంటున్న జీ5 దీని కోసం భారీ మొత్తాన్నే ఆఫర్ చేసినట్టుగా టాక్. ఎంత అనేది బయటికి రాలేదు కానీ ఇలాంటి క్రేజీ మూవీస్ తోనే బ్రాండ్ వస్తుందని అంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నారట. ఎలాగూ థియేటర్లు కనుచూపు మేరలో తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ ప్రభుత్వం కనికరించి తీసుకోండి అన్నా కొత్త నిబంధనలకు అనుగుణంగా హాలుని రూజ్ఞ్ చేయడం కంటే మూసి ఉంచడమే మంచిదంటున్నారు ఓనర్లు.

మల్టీ ప్లెక్సులు నయా రూల్స్ కు ఒప్పుకున్నా సింగల్ స్క్రీన్ యాజమాన్యాలు మాత్రం ససేమిరా అంటున్నారు. వ్యాక్సిన్ వచ్చి జనం యథేచ్ఛగా సినిమాలకు షాపింగులకు వచ్చే లోగా ఎంతలేదన్నా మూడు నెలలు పైగానే పడుతుంది. అప్పటిదాకా వేచి చూడటం ఎందరో నిర్మాతలకు ఆర్థికంగా చాలా భారంగా మారుతోంది. అందుకే ఒక్కొక్కరుగా కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదు. సోలో బ్రతుకే సో బెటరూకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ మొత్తానికి చర్చలైతే జరిగాయట. నాని వితో పాటు నిశ్శబ్దం కూడా డిజిటల్ రూట్ పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. నభ నటేష్ హీరోయిన్ గా థమన్ సంగీతం అందిస్తున్న సాయి తేజ్ మూవీతో సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే వచ్చిన ఆడియో సింగల్ సూపర్ హిట్ అయ్యింది. ప్రతి రోజు పండగే తర్వాత చేసిన సినిమా కావడంతో సాయి తేజ్ దీని సక్సెస్ పట్ల మంచి నమ్మకంతో ఉన్నాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp