3 సినిమాల బిజినెస్ టార్గెట్

By iDream Post Oct. 28, 2021, 12:50 pm IST
3 సినిమాల బిజినెస్ టార్గెట్

మరో శుక్రవారం బాక్సాఫీస్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. రేపు తొమ్మిది సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇందులో ప్రధానంగా మూడింటి మీదే ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. మొదటిది వరుడు కావలెను. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నాగ శౌర్య-రీతూ వర్మ కాంబినేషన్ ఫ్రెష్ గా అనిపించడంతో పాటు ట్రైలర్ ఆకట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారు 8 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎనిమిదిన్నర రావాలన్న మాట. రొమాంటిక్ ఇందులో సగమే చేసుకుంది. అంటే 4 కోట్ల దాకా డీల్స్ జరిగాయట. ఇది భారీ మొత్తం కాదు.


గత వారం రోజులుగా పూరి జగన్నాధ్ టీమ్ చేస్తున్న విస్తృతమైన ప్రమోషన్లు ఏ మేరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి. ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం, నిన్న ఏఎంబి సినిమాస్ లో టాలీవుడ్ సెలబ్రిటీలకు స్పెషల్ షోలు వేసి పాజిటివ్ టాక్ తెప్పించుకోవడం వీటి తాలూకు ప్రభావం రేపు తెలుస్తుంది. ఇక కన్నడలో భారీ బడ్జెట్ తో రూపొందిన జై భజరంగి డబ్బింగ్ సినిమా 70 లక్షల దాకా బిజినెస్ చేసుకుంది. ఇది చిన్న మొత్తమే అయినా ఇక్కడ అసలే ఇమేజ్ లేని శివ రాజ్ కుమార్ కు హిట్ టాక్ వస్తే తప్ప ఈ వసూళ్లు సాధ్యం కాదు. ఆ మధ్య వచ్చిన పొగరు, రాబర్ట్ ఫలితాలను చూసి ఈ రేట్ కు సెట్ చేసుకున్నారు కాబోలు.


ఇవి కాకుండా తమసోమా జ్యోతిర్గమయా, మైల్స్ అఫ్ లవ్, తీరం, మిషన్ 2020, ఏకం, మిస్టర్ ప్రేమికుడు అనే మరో ఆరు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. వీటికి కనీస ఓపెనింగ్స్ ఆశించడం కూడా కష్టమే. మౌత్ టాక్ వచ్చి బాగున్నాయనే మాట వినిపిస్తే తప్ప ఈవెనింగ్ షోకు జనం కనిపించరు. ఇక స్క్రీన్ కౌంట్ విషయానికి వస్తే రొమాంటిక్ 630కి పైగా, వరుడు కావలెను 600కి పైగా, జై భజరంగి 200కి పైగా థియేటర్లలో రిలీజవుతున్నాయి. గత వారం వచ్చినవాటిలో నాట్యం లాంటి సినిమాలు దాదాపుగా ఈ రోజుతో ఆఖరు. మరి రేపటి చిన్న సినిమాల పెద్ద యుద్ధంలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి మరి.


ALSO READ - పాత రజిని కనిపిస్తున్నాడు కానీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp