వ్యవస్థను ప్రశ్నించే యువ అధికారి

By iDream Post Apr. 05, 2021, 11:51 am IST
వ్యవస్థను ప్రశ్నించే యువ అధికారి

సుదీర్ఘమైన లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో విడుదల చేసిన మొదటి సినిమా సోలో బ్రతుకే సో బెటరూ రూపంలో ఓ జ్ఞాపకాన్ని మిగుల్చుకున్న సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ రిపబ్లిక్. ప్రస్థానం లాంటి టెర్రిఫిక్ పొలిటికల్ థ్రిల్లర్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న దర్శకుడు దేవా కట్ట ఆ తర్వాత ఆ స్థాయి చిత్రాన్ని తీయలేకపోయారు. ఆటో నగర్ సూర్య లాంటివి టేకింగ్ పరంగా ప్రశంసలు దక్కించుకున్నా కమర్షియల్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. ప్రస్థానం హిందీ రీమేక్ కూడా వర్కౌట్ కాలేదు. అందుకే కొంత గ్యాప్ తీసుకుని మరోసారి రాజకీయ ప్లస్ సామజిక నేపథ్యంతో వస్తున్నారు దేవ కట్ట. ఇందాకే దీని టీజర్ విడుదల చేశారు.

కేవలం నిమిషంలోపే ఉన్న టీజర్ లో కథలో ఉన్న మెయిన్ పాయింట్ ని మాత్రమే రివీల్ చేశారు. రాజకీయమంటే ఓట్లు వేయడం కేకలు పెట్టడం కాదు సమాధుల్లో కలిసిపోతున్న వ్యవస్థను ప్రశ్నించి దాన్ని దారిలో పెట్టాలనుకునే ఓ యువకుడి కథే రిపబ్లిక్. ఇందులో నేరుగా చెప్పలేదు కానీ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్న రమ్యకృష్ణ చాలా ఫ్రేమ్స్ లో జయలలితను తలపించడం విశేషం. ప్రభుత్వ అధికారులు నేతలకు బానిసలుగా మారితే జరిగే పరిణామాలు కూడా ఇందులో చూపించబోతున్నారు. సాయి తేజ్ కీలకమైన ఓ గవర్నమెంట్ ఆఫీసర్ లో కనిపించినట్టు క్లారిటీ అయితే వచ్చింది.

వీడియోలో అడుగడుగునా దేవ కట్ట మార్క్ పనితనం కనిపించింది. ఇటీవలి కాలంలో రాజకీయాల నేపథ్యంలో సినిమాలు రావడం లేదు. ఈ ప్రయత్నం ఆ కోణంలో చూస్తే మంచి ప్రయత్నంగా కనిపిస్తోంది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, విలన్ పాత్రధారి జగపతిబాబుని టీజర్ లో రివీల్ చేయలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరసగా ప్రాజెక్టులు చేజిక్కించుకుంటున్న మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రిపబ్లిక్ కి మరో ప్రధాన ఆకర్షణ. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు మరోసారి ధృవీకరించారు. మొత్తానికి రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకి భిన్నంగా రిపబ్లిక్ అంచనాలైతే పెంచింది

Teaser Link @ https://bit.ly/3wuEdoq

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp