కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ ?

By iDream Post May. 10, 2020, 05:38 pm IST
కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ ?

థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు కానీ పరిశ్రమలో అంతర్గతంగా పెద్దల మధ్య జరుగుతున్న చర్చలను బట్టి జులై నుంచి విడుదలకు ప్లానింగ్ చేస్తునట్టు తెలిసింది. జనం హాళ్లకు వస్తారా రారా అనేది ఆలోచిస్తూ కూర్చుంటే ఈ ఏడాది మొత్తం ఇలాగే గడిచిపోతుందని అలా చేసే బదులు ధైర్యంగా ముందడుగు వేసి రిలీజులు ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా పరిస్థితులు అవే చక్కబడతాయనే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి.

ఒకవేళ ఆశించిన స్థాయిలో భారీ స్పందన లేకపోతే ఖంగారు పడాల్సింది ఏమి లేదని ఖచ్చితంగా జనం వస్తారనే అభిప్రాయం అధిక శాతం ప్రొడ్యూసర్ల నుంచి వచ్చిందని సమాచారం. ఎలాగూ చిన్న చిన్న అవసరాలు, మద్యం కొనడం కోసం రోడ్ల పైకొస్తున్న జనం అన్ని జాగ్రత్తలు తీసుకుని నడిపితే ధియేటర్లకు కూడా వస్తారనే కోణంలో గట్టి విశ్లేషణ జరిగిందట. తాజాగా కొన్ని డేట్లను ప్రతిపాదించుకున్నట్టు తెలిసింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు నటించిన 'వి'ని జూలై 3కి ప్లాన్ చేశారట. సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన 'ఉప్పెన' కొంచెం గ్యాప్ తో జూలై 17కి షెడ్యూల్ చేశారట.

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా 'సోలో బ్రతుకే సో బెటరూ' జులై 31కి ఫిక్స్  చేసినట్టుగా తెలిసింది. అనుష్క 'నిశబ్దం', రానా 'అరణ్య' అప్ డేట్ ఇంకా తెలియలేదు. ఒకవేళ ప్రభుత్వాలు జూన్ నుంచి థియేటర్లు తీసుకోవచ్చు అంటేనే ఇవి అమలులోకి వస్తాయి. మొదటి రెండు మూడు వారాలు మెయిన్టెనెన్స్ తో పాటు పబ్లిక్ ని అలవాటు చేయడానికి వాడుకోవాలి కాబట్టి కొంచెం పాతవి లేదా స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ మూవీస్ వేసి ఆ తర్వాత కొత్త సినిమాలు ప్లాన్ చేసేలా మాట్లాడుకున్నారట. ఒకవేళ ఇదంతా నిజంగా జరిగితే ఇంకో నెలన్నరలో థియేటర్ల సందడి మొదలుకావొచ్చు. ఇక్కడ చెప్పినదంతా తెలంగాణ. ఏపి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అప్పటిదాకా వేచి చూడాలి మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp