బాక్సాఫీస్ సందడి మొదలైనట్టేనా ?

By iDream Post Jul. 21, 2021, 01:50 pm IST
బాక్సాఫీస్ సందడి మొదలైనట్టేనా ?

తెలంగాణ ప్రభుత్వం సింగల్ స్క్రీన్లకు పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడనికి అనుమతులు ఇవ్వడం నిన్న కొంత ఊరట కలిగించింది. మల్టీ ప్లెక్సుల్లో మాత్రం యధావిధిగా ఫ్రీగా ఈ సౌకర్యాన్ని కొనసాగించాలి. 23 అంటే ఎల్లుండి నుంచి పరిమిత సంఖ్యలో థియేటర్లు తెరవబోతున్నారు. నేరగాడుతో పాటు ఇంకో రెండు మూడు డబ్బింగ్ సినిమాలతో ఇవి స్టార్ట్ కాబోతున్నాయి. ఆంధ్రాలో కూడా సేమ్ సీన్. 30 నుంచి పూర్త స్థాయిలో అన్ని చోట్ల ఓపెన్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి. కానీ తూర్పు గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు టికెట్ రేట్ల విషయం తేలే దాకా తీయమని నిర్ణయించుకున్నట్టుగా వచ్చిన వార్త కొత్త కన్ఫ్యూజన్ కి తెరతీసింది.

ఇప్పటిదాకా ఉన్న కన్ఫర్మేషన్లో జులై 30కి మూడు సినిమాలు రాబోతున్నాయి. తేజ సజ్జ ఇష్క్, సత్య దేవ్ తిమ్మరుసులతో పాటు నరసింహపురం అనే చిన్న చిత్రం రిలీజ్ అవుతున్నాయి. ఎగ్జిబిటర్లకు ఆ మేరకు సమాచారం ఇచ్చారు కూడా. కానీ నిజంగా ఇవి మాట మీద ఉండగలవా అనే దాని మీద అనుమానాలు లేకపోలేదు. కరోనా తాకిడి ప్రస్తుతం లేకపోయినా కొన్ని చోట్ల ప్రభావం ఉంది. ఏపితో పాటు కర్ణాటకలోనూ యాభై శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో వాయిదా అసలు ఉండవు అని చెప్పడానికి లేదు. రోజురోజుకి పరిణామాలు మారిపోతున్నాయి కానీ ఏదీ ఖరారుగా అర్థం కావడం లేదు.

దానికి తోడు కర్ణాటకలో థియేటర్లు తెరిస్తే పట్టుమని 10 శాతం కూడా జనం రాకపోవడం కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. థర్డ్ వేవ్ మీద ఉన్న భయం వల్ల జనం రావడం లేదా లేక స్టార్ హీరోలు ఉన్న కొత్త సినిమాలు వేస్తే వస్తారా అనే విషయంలో విశ్లేషకులు సైతం ఎలాంటి కంక్లూజన్ కు రాలేకపోతున్నారు. ఇలాంటి కారణాల వల్లే డేట్ అనౌన్స్ చేద్దామని ముందు అనుకున్న టక్ జగదీష్ ఇప్పుడు సైలెంట్ అయ్యింది. లవ్ స్టోరీ కనీసం ప్రమోషన్ మీద కూడా దృష్టి పెట్టడం లేదు. కాబట్టి 30వ తారీఖు వచ్చేదాకా ఎలాంటి అభిప్రాయానికి రాలేం. మరోవైపు ఇంకొన్ని ఓటిటి డీల్స్ జరుగుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్

Also Read: మెగా రీమేక్ కు రిపేర్లు అవసరమే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp