'క్రాక్'లో స్పెషల్ సాంగ్ అందుకే

By iDream Post Oct. 16, 2020, 07:17 pm IST
'క్రాక్'లో స్పెషల్ సాంగ్ అందుకే

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం పాటల్లో బ్యాలన్స్ ఉన్న ఐటెం సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఇందులో వర్మ థ్రిల్లర్ ద్వారా పరిచయమైన అప్సర రాణి రవితేజతో కలిసి డాన్స్ చేస్తోంది. జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి ఈ పాట ముందు అనుకున్న ప్లానింగ్ లో లేదు. థియేటర్లు తెరిచే అవకాశాలు కనిపించనప్పుడు నిర్మాతలు కొద్దిరోజులు ఓటిటి ఆప్షన్ గురించి ఆలోచించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లగా సద్దుమణుగుతూ ఉన్నాయి.

థియేటర్లు తెరిచారు కాబట్టి నవంబర్ దీపావళి లేదా డిసెంబర్ క్రిస్మస్ నాటికి క్రాక్ ని సినిమా హాళ్లలోనే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. అలాంటప్పుడు మాస్ ప్రేక్షకులకు మరింత చేరువ కావాలంటే ఐటెం సాంగ్ ఉంటేనే కిక్కు. అందుకే అప్సర రాణిని లాక్ చేసుకున్నట్టుగా తెలిసింది. దీనికి థమన్ స్వరాలు సమకూర్చారు. తక్కువ టైంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి బెస్ట్ ఆప్షన్ గా అప్సర రాణి కనిపించింది కాబోలు. అందులోనూ థ్రిల్లర్ టైంలో తన పిక్స్ ఇన్స్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఓ రేంజ్ లో హల్చల్ చేశాయి. అందుకే యూత్ లోనూ క్రేజ్ వస్తుందనే నమ్మకంతో ఇలా ప్లాన్ చేశారు కాబోలు.

రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న క్రాక్ లో రెండు నేపధ్యాలు కనిపిస్తాయి. ఒకటి ఒంగోలు కాగా ఫ్లాష్ బ్యాక్ లో కర్నూల్ ఉంటుందని సమాచారం. భార్యగా నటిస్తున్న శృతి హాసన్ ఎపిసోడ్ ఎప్పుడో పూర్తి చేశారు. బెస్తవాళ్లలో ఉండే నేరస్థుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన క్రాక్ లో విలన్లుగా సముతిరఖని, వరలక్ష్మి శరత్ కుమార్ లు నటించడం ఆసక్తిని పెంచుతోంది. అసలే వరస డిజాస్టర్లతో డీలాపడిన మాస్ మహారాజా అభిమానులు ఆశలన్నీ క్రాక్ మీదే పెట్టుకున్నారు. లేట్ అయినా పర్లేదు తమ హీరోని వెండితెర మీదే చూడాలని కోరుకున్నారు. ఫైనల్ గా దే జరిగేలా కనిపిస్తోంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp