సీమ యాసలో మాస్ మహారాజా

By iDream Post Jun. 14, 2021, 05:00 pm IST
సీమ యాసలో మాస్ మహారాజా
క్రాక్ ఇచ్చిన కిక్ ని బాగా ఆస్వాదించిన మాస్ మహారాజా రవితేజ మరికొద్ది రోజుల్లో జరగబోయే ఖిలాడీ బాలన్స్ షూటింగ్ లో పాల్గొని ఆపై శరత్ మండవ డైరెక్షన్ లో రూపొందబోయే సినిమాలో పాల్గొంటాడు. నిజానికి దీనికన్నా ముందు త్రినాధరావు నక్కిన ప్రాజెక్ట్ మొదలుకావాల్సి ఉన్నా ఏవో బయటికి చెప్పని కారణాలతో దాన్ని ఆలస్యం చేస్తూ వస్తున్నారు. ఖిలాడీ మీద కూడా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు క్రాక్, ఖిలాడీ రీమేక్ ల మీద కన్నేశాడట. ఒకవేళ ఖిలాడీ బాగా ఆడితే ముందు ఇది తీసి ఆ తర్వాత క్రాక్ చేస్తాడట. లేదూ అంటే ప్లాన్ రివర్స్ లో ఉంటుందన్న మాట.

గతంలో సల్మాన్ కిక్ ని తీసుకుని పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి అందరికీ గుర్తే. ఇక అసలు విషయానికివ్ వస్తే శరత్ మండవ సినిమాలో రవితేజ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తాడట. దీని కోసం ప్రత్యేకంగా సీమ యాసని ట్యూటర్స్ ని పిలిపించుకుని మరీ నేర్చుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ చూడని విధంగా రవితేజని ఓ సరికొత్త అవతారంలో చూపించబోతున్నట్టు శరత్ మరీ మరీ ఊరిస్తున్నాడు. ఇప్పటికే థీమ్ సాంగ్ కంపోజింగ్ తో పాటు టైటిల్ ని కూడా లాక్ చేశారట. రెగ్యులర్ షూట్ మొదలయ్యాక వీటికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తారు.

కరోనా సెకండ్ వేవ్ రాకపోయి ఉంటే గత నెల చివరి వారంలోనే ఖిలాడీని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు థియేటర్లు తెరిచే దాకా వేచిచూడాల్సిందే. 1990 బ్యాక్ డ్రాప్ లో శరత్ మండవ సినిమా సాగుతుందని వినికిడి. టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా సెట్ చేశారట.  ఇన్ని ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ఉన్న కారణంగానే రవితేజ హఠాత్తుగా దీన్ని లైన్ లో పెట్టినట్టు తెలిసింది. క్రాక్ తో మార్కెట్ మళ్ళీతిరిగి రావడంతో ఖిలాడీకి వచ్చిన డిమాండ్ ని క్యాష్ చేసుకోవడం కోసం నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తున్నారు. దసరా కన్నా ముందే థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటే కనక ఆలోపే రిలీజ్ చేసేలా ప్లానింగ్ తో ఉన్నారు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp