రవితేజ ట్రిపుల్ బొనాంజా

By iDream Post Nov. 30, 2020, 05:11 pm IST
రవితేజ ట్రిపుల్ బొనాంజా

మాస్ మహారాజా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రాక్ విడుదల సంక్రాంతికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వల్లనో లేదా ప్రభుత్వ నిబంధన వల్లనో ఏదైనా అనూహ్య మార్పు జరిగితే తప్ప దాదాపు రిలీజ్ ఫిక్సయినట్టే. ఇదిలా ఉండగా దీని తర్వాత రమేష్ వర్మ డైరెక్షన్లో చేస్తున్న ఖిలాడీ షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో పూర్తి చేసేలా ప్లానింగ్ జరిగిందట. వచ్చే ఏడాది ఖచ్చితంగా మూడు సినిమాలు వచ్చేలా రవితేజ ధృడ నిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. ఖిలాడీని వేసవి కానుకగా అందించి దసరా లేదా దీపావళికి ఇంకో మూవీ వదిలితే బాలన్స్ అవుతుందన్నది ప్లాన్. ఒకప్పుడు రవితేజది ఈ స్పీడే. ఇప్పుడూ అదే కొనసాగించబోతున్నాడు.

ప్రతి రోజు పండగే తర్వాత ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకున్న దర్శకుడు మారుతీ రవితేజ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసి ఎదురు చూస్తున్నాడు. లైన్ ఓకే చేసిన రవితేజ ఫైనల్ వెర్షన్ లో కొన్ని మార్పులు కోరాడట. దీంతో వాటిని సరిదిద్దే పనిలో మారుతీ బిజీగా ఉన్నాడు. ఒకవేళ ఇదేమైనా ఆలస్యమయ్యేలా ఉంటె త్రినాధరావు నక్కిన ప్రాజెక్ట్ ముందుకు వస్తుంది. ఇది కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ లో ఉంటుందట. క్రాక్ పక్కా మాస్ యాక్షన్ మూవీ కాబట్టి దాని తర్వాత వచ్చేవి తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు కామెడీతో కలిసి ఉండాలనే ఈ ఇద్దరు దర్శకులను ఎంచుకున్నాడు మాస్ రాజా.

వీటికి సంబంధించిన క్లారిటీ రావడానికి ఇంకా టైం పడుతుంది. మరోవైపు వక్కంతం వంశీ కూడా వెయిటింగ్ లో ఉన్నాడు కానీ అది 2022లో కానీ మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. అసలే వరస డిజాస్టర్లతో కుదేలైన రవితేజకు సాలిడ్ హిట్ క్రాక్ రూపంలో దక్కుతుందని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన క్రాక్ లో శృతి హాసన్ హీరోయిన్. తమన్ సంగీతానికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ సంక్రాంతికి ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మాత్రం క్రాక్ ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అప్పటిదాకా ఎదురుచూపులే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp